బెంగుళూర్: హైదరాబాదులోని మక్కా మసీదులో షూటింగుపై మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంపై మాట్లాడేందుకు హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా నిరాకరించారు. ఈ విషయంపై తాను ఏమీ మాట్లాడదల్చుకోలేదని ఆమె ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. తనతో మాట్లాడవద్దని కూడా ఆమె అన్నారు. యాడ్ ఫిల్మ్ షూటింగుపై వివాదం సృష్టించవద్దని ఆమె కోరారు. హైదరాబాదులోని మక్కా మసీదులో సోమవారం జరిగిన ఒక యాడ్ ఫిల్మ్ షూటీంగులో ఆమె పాల్గొన్నారు. ఆమె మంగళవారంనాడు బెంగుళూరులో జరుగుతున్న మూడో టెస్టును ఆసక్తిగా తిలకిస్తూ కనిపించారు. పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్ తన అభిమాన క్రికెటర్ అని ఆమె గతంలో ఒకసారి ప్రకటించారు.