Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జపాన్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్ లో సానియా


Sania Mirza టోక్యో: టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ ముడో టయర్ మహిళా విభాగం టెన్నిస్ టోర్మమెంటులో హైదరాబాద్ సంచలనం సానియా మీర్జా క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించింది. సానియా రెండో రౌండులో ఆస్ట్రేలియాకు చెందిన కేసే డెల్స్ అక్వాను 6-4, 3-6, 6-4 స్కోరుతో ఓడించి క్వార్టర్ ఫైనల్ లో అడుగు పెట్టింది.

ఫ్రావ్యా పెన్నేట్టా, అబిగైల్ స్పియర్స్ మధ్య జరిగే పోటీలో గెలుపొందిన క్రీడాకారిణితో తదుపరి పోటీలో తలపడుతుంది. డబుల్స్ లో కూడా సానియా క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించింది. సానియా, ఆమె జోడీ అమెరికాకు చెందిన క్రిస్టినా ఫుసానో రెండో రౌండులో ఉర్సులా రాడ్వానాసాకా, అగ్నీస్ జోడీపై 6-3, 6-2 స్కోరుతో విజయం సాధించింది.
Story first published: Wednesday, October 3, 2007, 23:53 [IST]
Other articles published on Oct 3, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+