హోబర్ట్ టోర్నీ నుంచి సానియా ఔట్

హోబర్ట్: హోబర్ట్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంటు క్వార్టర్ ఫైనల్లో సానియా మీర్జా ఇటలీకి చెందిన ఫ్లావియా పెన్నెట్టా చేతిలో ఓడిపోయింది. బుధవారంనాడు ఆమె పెన్నెట్టాతో తలపడింది. దీంతో ఆమె హోంబర్ట్ టోర్నీ నుంచి తప్పుకుంది. సానియా 5-7, 6-1, 3-6 స్కోరుతో ఓటమి పాలైంది.
మంగళవారంనాడు జరిగిన హోబర్ట్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీ రెండో రౌండులో విజయం సాధించి సానియా మీర్జా క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆమె 6-3, 6-4 సెట్లతో రష్యాకు చెందిన కుద్రియత్సేవాపై విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన జెలీనా డోకిక్ అర్ధాంతరంగా నిష్క్రమించడంతో పెన్నెట్టా క్వార్టర్స్‌లో ప్రవేశించింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సానియా స్పెయిన్‌కు చెందిన క్వాలిఫైర్ లూర్దెస్ డోమింగెజ్‌ను 6-4, 6-0 సెట్లతో ఓడించిన సంగతి తెలిసిందే.
Story first published: Wednesday, January 9, 2008, 14:55 [IST]
Other articles published on Jan 9, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications