Sania Mirza: టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు ప్రస్తుతం జోరుగా ప్రచారంలో ఉన్నాయి. పాకిస్థాన్ స్టార్ క్రికెట్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సానియా మీర్జా.. కుమారుడు పుట్టిన అనంతరం అతడితో విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సానియా ఒంటరిగా తన కుమారుడి ఆలన పాలన చూసుకుంటూ.. అప్పుడప్పుడూ కుమారుడికి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు సానియా మీర్జా మళ్లీ పెళ్లికి చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఒక ప్రముఖ టాలీవుడ్ హీరోతో ఆమె పెళ్లి జరగబోతోందని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
సానియా డేటింగ్ వార్తలు.. పెళ్లి పుకార్లు
సానియా మీర్జా, ఓ టాలీవుడ్ హీరో ఒక కాఫీ షాపులో డేటింగ్‌కు వెళ్లారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ డేటింగ్ వార్తల తర్వాతే వారి పెళ్లి గురించి పుకార్లు మొదలయ్యాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. "నిప్పు లేనిదే పొగరాదు కదా" అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి సానియా మీర్జా మళ్లీ ఒక ఇంటి వారయితే..ఆమె అభిమానులకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది?.. అందుకే సానియాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ వార్తలపై సానియా నుంచి అధికారికంగా ప్రకటన వస్తే పూర్తి స్పష్టత వస్తుంది.

గతంలోనూ పుకార్లు
సానియా మీర్జా పెళ్లిపై గతంలోనూ ఇలాంటి పుకార్లు వచ్చాయి. ప్రముఖ క్రికెటర్ మహ్మద్ షమీని సానియా పెళ్లాడనున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అంతే కాకుండా.. ఇరువురి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని.. సానియా తన కొడుకు సమక్షంలోనే షమీని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రాగా.. సానియా ఆ వార్తలను కొట్టిపడేశారు. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ హీరోతో పెళ్లి అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
సానియా మీర్జా టెన్నిస్ కెరీర్
భారత టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా మీర్జా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. సానియా మహిళల డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంకును పొందిన క్రీడాకారిణిగా రికార్డును నమోదు చేసింది. సింగిల్స్ నుంచి డబుల్స్‌కు మారిన తర్వాతే సానియా కెరీర్ సరికొత్త మలుపు తిరిగింది. ఆమె డబుల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకును (ఏప్రిల్ 13, 2015న) సాధించి ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. ఆమె తన కెరీర్‌లో 43 డబుల్స్ డబ్ల్యూటీఏ టైటిళ్లు గెలుచుకుంది. సానియా మీర్జా మొత్తం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సాధించి భారత టెన్నిస్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తో ఆమె భాగస్వామ్యం ఆమె డబుల్స్ కెరీర్‌లో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. ఈ జోడి అప్రతిహత విజయాలు సాధించి, టెన్నిస్ ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించింది. సానియా మీర్జా నాలుగు ఒలింపిక్స్‌లో (2008, 2012, 2016, 2020) భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో పాటు కామన్వెల్త్ క్రీడల్లో ఒక రజతం, ఒక కాంస్యం ఆమె గెలుచుకుంది.
2018లో కుమారుడు పుట్టిన తర్వాత ఆమె టెన్నిస్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చింది. అయితే, ఏడాదిన్నర తర్వాత పూర్తి ఫిట్‌గా మారి పునరాగమనం చేసి మరో రెండు టైటిళ్లను గెలుచుకోవడం ఆమె పట్టుదలకు నిదర్శనం.చివరకు, ఫిబ్రవరి 2023లో దుబాయ్ ఓపెన్ తన వృత్తిపరమైన కెరీర్‌లో చివరి టోర్నమెంట్ అని సానియా ప్రకటించి, టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది.