Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా చివరి శ్వాస వరకు నేను నీతోనే ఉంటా: సానియా మిర్జా భావోద్వేగం

Sania Mirza wishes son Izhaan on first birthday: Ill be with you till my last breath

హైదరాబాద్: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కుమారుడు ఇజాన్‌ మీర్జా మాలిక్‌ బుధవారం తన తొలి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సానియా తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేసింది.

ఏడాది క్రితం ఇజాన్ పుట్టినప్పుడు తీసిన ఫొటోను పోస్టు చేస్తూ "ఈ ప్రపంచంలోకి వచ్చి నువ్వు ఏడాది అయింది. ఇప్పుడు నా ప్రపంచం అయ్యావు. నువ్వు తొలిసారి నవ్వినప్పటి సందర్భం నాకు ఇప్పటికీ గుర్తే. నువ్వు ఎక్కడికెళ్లినా ఈ నవ్వునే కొనసాగించాలి. ఐలవ్యూ. నా చివరి శ్వాస వరకు నేను నీతోనే ఉంటాను. నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధించే విధంగా నిన్ను ఆశీర్వదించాలని అల్లాని ప్రార్థిస్తున్నాను" అని కామెంట్ పెట్టింది.

ఇజాన్ మీర్జా మాలిక్ మొదటి పుట్టినరోజున బాలీవుడ్ సెలబ్రిటీలు హ్యూమా ఖురేషితో పాటు నేహా ధూపియాలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు తన సోదరి ఆనమ్‌తో ఇజాన్‌ ఆడుకుంటున్న వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది. గతేడాది ఇదే రోజున సానియా మిర్జా పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, October 30, 2019, 17:55 [IST]
Other articles published on Oct 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+