చీర కట్టులో సింగారాలు: వన్‌ఇండియా తెలుగు ట్వీట్‌ను రీట్వీట్ చేసిన సానియా
హైదరాబాద్: భారత్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోమవారం జరిగిన అంతర్జాతీయ జ్యూయలరీ షోలో తళుక్కున మెరిసింది. ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయలరీ వీక్ (ఐఐజెడ్ల్యు)లో భాగంగా సోమవారం ముంబైలో నిర్వహించిన ర్యాంప్ వాక్ లో పాల్గొన్న సానియా ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.

నిండైన చీరకట్టు, స్లీవ్ లెస్ జాకెట్, మెడ చుట్టూ భారీ వజ్రాభరణాలు, తెలుగుదనం ఉట్టిపడేలా నడుముకు వడ్డాణం, కాళ్లకు హై హీల్స్‌తో మెరిసిపోయిన సానియా ఫ్యాషన్ దివాగా వెలిగిపోయింది. ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయలరీ వీక్ ముగిసిన అనంతరం సానియా మిర్జా మాట్లాడుతూ తన స్నేహితురాలు మోనీ అగర్వాల్ కోరిక మేరకు ఈ షో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

ఈ షోలో షో టాపర్‌గా సానియా మిర్జా మోనీ అగర్వాల్ డిజైన్ చేసిన 'జొరాక్షి' సిరీస్ ఆభరణాలను ధరించి కనువిందు చేశారు. ఈ ఏడాది 'జొరాక్షి' సిరీస్ ఆభరణాలను ప్రదర్శించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రపంచంలోని అత్యంత అధ్భుతంగా ఉండేలా పుష్పాలను తలపించేలా ఈ నగలను మోనీ అగర్వాల్ డిజైన్ చేశారు.
ఈ జ్యూయలరీ వీక్‌లో పాల్గొన్న సానియా మిర్జా ఫోటోలను వన్ఇండియా తెలుగు వెబ్‌సైట్ ట్వీట్ చేయగా ఆ ట్వీట్‌ను సానియా రీట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications