కథ ఇష్టం లేదు, దీపికా ఐతే ఓకే: సానియా(ఫోటోలు)
హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంలో ఆమె మాట్లాడుతూ తన జీవిత కథను తెరకెక్కించడం తనకు ఇష్టం లేదని చెప్పింది.
తన జీవిత విశేషాలను ఇతరులకు చెప్పడం తనకు ఇష్టం ఉండదని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చెప్పింది. ఒకవేళ తనపై ఎవరైనా సినిమా తీస్తే అందులో తన పాత్రను దీపికా పదుకొణె పోషిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.
మాదాపూర్‌లోని ట్రెడెంట్ హోటల్‌లో జెఆర్‌ఎస్ ఇండస్ట్రీస్ గురువారం నిర్వహించిన కంపెనీ నూతన బ్రాండ్ ఫ్యాబ్ బి లోగోను ఆమె ఆవిష్కరించారు. క్రీడాకారుల జీవిత చిత్రాల్లో తెరపై కేవలం క్రీడాజీవితమే ఉండాలని సానియా సూచించారు. క్రీడాకారులకు ఆటల్లోనే కాదు సేవా, ఇతర రంగాల నుంచి పేరు వచ్చినా ఆనందంగా ఉంటుందని అందుకోసమే బ్రాండ్ అంబాసిడర్‌గా కంపెనీ ప్రచార బాధ్యతలు తీసుకున్నానని ఆమె చెప్పారు.
ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిషింగ్స్, ఆటోమొబైల్ రిటైల్ రంగంలోకి అడుగుపెడుతున్న జేఆర్‌ఎస్ ఇండస్ట్రీస్ నూతన బ్రాండ్ ఫ్యాబ్ బీ కి ప్రచారకర్తగా వ్యవహరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. లగ్జరీ గాడ్జెట్స్‌ని అమితంగా ఇష్టపడతనని, భారత మార్కెట్లోకి ఐఫోన్ 6 రాకముందే అది తన చేతిలో ఉందన్నారు.
లగ్జరీ అంటే ఇష్టపడే తమ ఇంట్లో ఆధునిక టెక్నాలజీ ఎప్పుడూ అప్‌డేట్ అవుతుంది. ఇంట్లో ఎంతటి హైలైఫ్‌కు అనువైన సౌకర్యం ఉన్నా ప్రేమ, కరుణ ఉంటేనే అది నిజమైన డ్రీమ్ హౌస్ అన్న సంగతి అందరూ గుర్తించాలని పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం సానియా మిర్జా త్వరలో సింగపూర్‌లో జరగనున్న డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్‌పై దృష్టి సారించారు. అంతేకాదు స్చచ్ఛ భారత్‌లో భాగంగా రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ అహ్వానాన్ని ఆమె స్వీకరించారు.
ఈ సందర్బంగా సానియా మిర్జా మాట్లాడుతూ అనిల్ అంబానీ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నానని, త్వరలో సమయం చూసుకుని సింగపూర్‌లో జరగనున్న డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్‌కు వెళ్ళే లోపే స్వచ్ఛ్ భారత్‌లో పాల్గొంటానని తెలిపింది.

జీవిత కధ ఇష్టం లేదు, దీపికా ఐతే ఓకే: సానియా
హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో జేఆర్‌ఎస్ ఇండస్ట్రీస్ బిజినెస్ ప్లాన్స్ ఆవిష్కరిస్తున్న టెన్నిస్ స్టార్ సానియా మిర్జా.

జీవిత కధ ఇష్టం లేదు, దీపికా ఐతే ఓకే: సానియా
హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో జేఆర్‌ఎస్ ఇండస్ట్రీస్ బిజినెస్ ప్లాన్స్ ఆవిష్కరిస్తున్న టెన్నిస్ స్టార్ సానియా మిర్జా.

జీవిత కధ ఇష్టం లేదు, దీపికా ఐతే ఓకే: సానియా
ఈ కార్యక్రమంలో సానియా మిర్జా మాట్లాడుతూ తన జీవిత కథను తెరకెక్కించడం తనకు ఇష్టం లేదని చెప్పింది.

జీవిత కధ ఇష్టం లేదు, దీపికా ఐతే ఓకే: సానియా
తన జీవిత విశేషాలను ఇతరులకు చెప్పడం తనకు ఇష్టం ఉండదని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చెప్పింది.

జీవిత కధ ఇష్టం లేదు, దీపికా ఐతే ఓకే: సానియా
ఒకవేళ తనపై ఎవరైనా సినిమా తీస్తే అందులో తన పాత్రను దీపికా పదుకొణె పోషిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.

జీవిత కధ ఇష్టం లేదు, దీపికా ఐతే ఓకే: సానియా
ఇక ప్రస్తుతం సానియా మిర్జా త్వరలో సింగపూర్‌లో జరగనున్న డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్‌పై దృష్టి సారించారు.

జీవిత కధ ఇష్టం లేదు, దీపికా ఐతే ఓకే: సానియా
అంతేకాదు స్చచ్ఛ భారత్‌లో భాగంగా రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ అహ్వానాన్ని ఆమె స్వీకరించారు.

జీవిత కధ ఇష్టం లేదు, దీపికా ఐతే ఓకే: సానియా
అనిల్ అంబానీ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నానని, త్వరలో సమయం చూసుకుని సింగపూర్‌లో జరగనున్న డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్‌కు వెళ్ళే లోపే స్వచ్ఛ్ భారత్‌లో పాల్గొంటానని తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications