
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బుధవారం తన 31వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అబిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సానియా భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సైతం అందరి లాగే ట్విటర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడు. 'నా ప్రియమైన భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సమయంలో ఆమెకు దూరంగా ఉన్నందుకు చింతిస్తున్నా' అని షోయబ్ ట్వీట్ చేశాడు.
సానియా మిర్జా పుట్టినరోజు క్రీడారంగాని చెందిన పలువురు ప్రముఖులతో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ కొరియా గ్రాఫర్ ఫర్హా ఖాన్... సానియాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సానియా మీర్జా మోకాలి గాయంతో బాధపడుతోంది. ఈ కారణంగా దాదాపు నెల రోజుల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి శస్త్రచికిత్స అవసరమా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.
ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా సానియా మీడియాతో మాట్లాడుతూ 'మోకాలి గాయంతో బాధపడుతున్నాను. నెల పాటు ఆటకు దూరంగా ఉండాలి. శస్త్రచికిత్స అవసరమా లేదా అన్న దానిపై తర్వలో నిర్ణయానికి రావాల్సి ఉంది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు కొన్ని వారాల సమయం పట్టే అవకాశముంది. ఈ ఏడాదిని టాప్-10 ర్యాంకింగ్స్‌కు దగ్గరగా ముగించడం సంతోషంగా ఉంది' అని సానియా అంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.