తన ప్రెగ్నెన్సీపై ఉచిత సలహాలు: ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో మండిపడ్డ సానియా

హైదరాబాద్: ప్రసవం అనంతరం తాను టెన్నిస్‌ను కొనసాగిస్తానని హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా వెల్లడించారు. నిండు గర్భిణి అయిన సానియా మిర్జా త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నగరంలోని ఓ హోటల్లో తన సోదరి లేబుల్‌బజార్ పేరిట ఆనమ్ మీర్జా ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను సానియా తన భర్త షోయబ్ మాలిక్‌తో కలిసి హాజరయ్యారు.
కొంచెం బాధగానే ఉన్నప్పటికీ
ఈ సందర్భంగా సానియా మీడియాతో మాట్లాడుతూ "ప్రసవం కోసం 9 నెలల పాటు ఆటకు దూరంగా ఉండటం కొంచెం బాధగానే ఉన్నప్పటికీ.. అమ్మ కాబోతున్న ఆలోచన చాలా ఆనందాన్నిస్తుంది. తనను భర్త షోయబ్ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ప్రసవం తరువాత కూడా మహిళలు తమ కెరీర్‌ను కొనసాగించవచ్చు. ఆరోగ్యం కాపాడుకుంటూ తమ రంగంలో ముందుకు సాగడం ఇబ్బందేమీ కాదు" అని తెలిపారు.
పుట్టబోయే చిన్నారి కోసం భారత్, పాక్ దేశాల్లోని స్నేహితులు
ఇక, షోయబ్ మాలిక్ మాట్లాడుతూ తమకు పుట్టబోయే చిన్నారి కోసం భారత్, పాక్ దేశాల్లోని స్నేహితులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని అన్నాడు. తన జీవితంలో తల్లి, భార్య ఇద్దరూ ఎంతో కీలకమని అన్నాడు. ఇదిలా ఉంటే, గర్భధారణ సమయం మహిళలకు ఎంతో ప్రత్యేకం. అందరిలాగే సానియా కూడా ఈ సమయాన్ని చాలా ప్రత్యేకంగా గడుపుతున్నారు.
ఉచిత సలహాలు మాత్రం చికాకుగా గురిచేస్తున్నాయి
అయితే కొందరు వ్యక్తులు ఇచ్చే ఉచిత సలహాలు మాత్రం తనను చికాకుగా గురిచేస్తున్నాయని సానియా వెల్లడించారు. "సలహాలు ఇచ్చేవారు(అందులో ఎక్కువమంది మగవారు) గర్భం ధరించిన మహిళలు 9 నెలల పాటు కనిపించకుండా సుప్తావస్థలో ఉండాలనుకుంటున్నారు. ఈ స్థితిలో ఉన్నందుకు సిగ్గుపడి ఇంట్లో ఓ పక్కకు కూర్చొవాలనుకుంటున్నారు"
గర్భం ధరించిన వారు కూడా సాధారణ మనుషులే
"ఓ శవంగా పడి ఉండాలా. గర్భం ధరించిన వారు కూడా సాధారణ మనుషులే. వారు సాధారణ జీవితం గడపడానికి అనుమతి ఉంది. కొంచెం ఇలాంటి ఆలోచనలను తీసివేయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు.. అమ్మ పొట్టలో నుంచే కదా" అని సానియా మిర్జా వరుస ట్వీట్లతో మండిపడ్డారు. ఈ అక్టోబరులో సానియా మిర్జా ఓ బిడ్డకు జన్మనివ్వబోతోన్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications