
సానియా మీర్జా సోదరి వివాహం
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా-హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అక్బర్ రషీద్ బేగ్‌ల వివాహం శుక్రవారం నగరంలో ఘనంగా జరిగింది.

వివాహ వేడుక
ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.

పెళ్లి సందడి
ఈ వివాహ వేడుకకు హాజరైన వారిలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహామూద్ అలీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ సుబ్బరామిరెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వరినాథ్, టెన్నిస్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, సినీ నిర్మాత సురేష్ బాబు, నటి మంచు లక్ష్మి, సీవీ ఆనంద్ దంపతులు, తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఫ్యామిలీతో సానియా
వివాహ వేడుక సందర్భంగా ఫ్యామిలీతో ఫొటో దిగిన సానియా దంపతులు.

సినీతారల సందడి
సోనియా సోదరి వివాహ వేడుక సంగీత్‌కు హాజరైన సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, ఉపాసనలతో సానియా మీర్జా.

చిందేసిన సానియ
సంగీత్ కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు రాంచరణ్ తేజ్ తోపాటు బాలీవుడ్ నటీనటులు సల్మాన్ ఖాన్, పరిణితి చోప్రా తదితరులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా సల్మాన్, పరిణితిలతో కలిసి సానియా మీర్జా స్టేజిపై స్టెప్పులేసి అలరించారు.


Click it and Unblock the Notifications











