For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇదే నా హ్యాపీ ప్లేస్‌: సానియా మీర్జా

Sania Mirza shares the cutest picture with son Izhaan: My happy place

హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ప్రమాదకర వైరస్ దెబ్బకు అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో భారత టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా గత 75 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. సానియాతో పాటు ఆమె తన ముద్దుల తనయుడు ఇజాన్‌ మీర్జా మాలిక్‌, తల్లిదండ్రులు హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ అయ్యారు. మియామీ ఓపెన్‌లో పాల్గొనేందుకు అమెరికాలో ఉన్న సానియా మీర్జా.. లాక్‌డౌన్‌ విధించడానికి ముందు హైదరాబాద్‌ వచ్చారు.

సానియా మీర్జా హైదరాబాద్‌ వచ్చీరావడంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు 14 రోజలు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అనంతరం తన ముద్దుల కుమారుడిని ఒడిలోకి తీసుకొని మురిసిపోయారు. ఇదిలా ఉంటే.. సానియా మంగళవారం తన కుమారుడు ఇజాన్‌తో ఉన్న అందమైన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. 'ఇదే నాకు ఆనందాన్నిచ్చే చోటు' అంటూ ఫొటోకు కాప్షన్ జత చేసారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది.

View this post on Instagram

My happy place 🍫💕 @izhaan.mirzamalik

A post shared by Sania Mirza (@mirzasaniar) on

లాక్‌డౌన్ కారణంగా సానియా మీర్జా, కొడుకు ఇజాన్ హైదరాబాద్‌లోని ఉండగా.. పాకిస్థాన్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్, భర్త‌ షోయబ్‌ మాలిక్ పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో ఉన్నారు. దీంతో సానియా ఆందోళన చెందుతున్నారు. 'పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతూ షోయబ్ అక్కడే చిక్కుకున్నాడు. నేను లాక్‌డౌన్ ముందు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చా. దీంతో ఇజాన్‌ను చూసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ప్రస్తుత పరిస్థితిలో ఇజాన్ తన తండ్రిని ఎప్పుడు చూస్తాడో తెలియదు' అని ఇటీవల సానియా పేర్కొన్నారు.

సానియా మీర్జా, షోయబ్‌ మాలిక్‌ల వివాహం 2010 ఏప్రిల్ 12న జరిగింది. హైదరాబాద్‌లో సాంప్రదాయ పద్దతిలో షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా వివాహం చేసుకుంది. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు. అతని పేరు ఇజాన్ మీర్జా మాలిక్. ఇటీవల ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సందర్భంగా సానియా తన కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి ఓ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ... 'ఈ ఫొటోలోనే నా జీవితం. నాకు మరో మార్గం లేదు. నా పని నేను ఉత్తమంగా చేయడానికి ఇజాన్ నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు' అనే క్యాప్షన్‌ సానియా పెట్టారు.

Story first published: Wednesday, June 10, 2020, 9:41 [IST]
Other articles published on Jun 10, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+