Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌ vs టెన్నిస్‌.. క‌న్‌ప్యూజ‌న్‌లో సానియా కుమారుడు!!

Sania Mirza Shares Son Izhaans Photo With Tennis Racquet, Fans Ask Obvious Question

హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ స‌మ‌యాన్ని ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. కొంద‌రు క్రీడాకారులు ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. మ‌రికొంద‌రు సోషల్‌ మీడియా వేదికగా వెరైటీ ముచ్చట్లతో ఫ్యాన్స్‌ను రిలాక్స్‌ మూడ్‌లోకి తీసుకెళుతున్నారు. ఇంకొందరు కుటుంబ‌ స‌భ్యుల‌తో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. భార‌త టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా త‌న ముద్దుల త‌న‌యుడు ఇజాన్‌తో సరదా సమయం గడుపుతోంది.

తాజాగా సానియా మీర్జా తన ట్వీటర్‌ అకౌంట్‌లో కుమారుడు ఇజాన్‌ ఫొటోను పోస్ట్‌ చేసింది. చేతిలో టెన్నిస్‌ రాకెట్‌ను పట్టుకుని ఉన్న ఇజాన్‌ ఫోటో పెట్టిన సానియా.. 'అస‌లు ఇదంతా ఏంటీ అని ఇజాన్ ఆలోచిస్తున్న‌ట్లు కనిపిస్తుంది' అంటూ కామెంట్‌ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఫొటోపై నెటిజన్లు భిన్నమైన ప్రశ్నలు సంధిస్తున్నారు. సానియా మీర్జా భర్త షోయబ్‌ మాలిక్‌ క్రికెటర్‌ కావడంతో ఇజాన్‌ను ఏమి చేస్తారు అని కొందరు అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

'మీ ముద్దుల తనయుడు ఇజాన్‌ను క్రికెటర్‌ ప్లేయర్‌ చేస్తారా.. లేక టెన్నిస్‌ ప్లేయర్‌ చేస్తారా' అని ఒక అభిమాని అడగ్గా.. మరొక అభిమాని మాత్రం 'ఎడమ చేతిలో కూడా బ్యాట్‌ ఉంది' అని సరదాగా కామెంట్‌ చేశాడు. క్రికెట్‌ vs టెన్నిస్‌ అని మరో ఫ్యాన్ ట్వీట్ చేసాడు. అయితే రోహ‌న్ బోప‌న్న‌, వ‌హాబ్ రియాజ్‌ మాత్రం ఇజాన్ సూప‌ర్ అంటూ కామెంట్లు చేశారు. సానియా ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సందర్భంగా సానియా తన కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి ఓ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ... 'ఈ ఫొటోలోనే నా జీవితం. నాకు మరో మార్గం లేదు. నా పని నేను ఉత్తమంగా చేయడానికి ఇజాన్ నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు' అనే క్యాప్షన్‌ సానియా పెట్టింది. ఇజానే తన సర్వస్వం అని సానియా చెప్పకనే చెప్పింది. సానియా తల్లిగా కొడుకు సంరక్షణతో పాటు కెరీర్‌ను కూడా బాగా సమన్వయం చేసుకుంటుంది. 2010లో పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్ మాలిక్‌ను సానియా వివాహం చేసుకుంది.

సుమారు మూడేళ్ల పాటు సానియా మీర్జా టెన్నిస్‌కు దూరమయ్యారు. ఇజాన్‌కు జన్మనిచ్చే క్రమంలో ఆమె ఇంటికే పరిమితమైంది. ఇటీవలే తన రీఎంట్రీ ఇచ్చిన సానియా.. అదరగొట్టింది. అయితే కరోనా వైరస్‌ కారణంగా మరోసారి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ టోర్నీలు రద్దు కావడంతో పాటు పలు క్రీడా ఈవెంట్‌లు కూడా వాయిదాలు పడ్డాయి.

Story first published: Thursday, April 9, 2020, 16:10 [IST]
Other articles published on Apr 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+