న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకే ఫొటోలోనే నా జీవితం.. నాకు మరో మార్గం లేదు: సానియా

Sania Mirza Shares Heartwarming Picture With Son Izhaan, Goes Viral

హైదరాబాద్: భారత టెన్నిస్‌ స్టార్‌, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాకు సంబందించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సానియా పోస్ట్ చేసిన ఆ ఫొటోలో.. ఓ చేతిలో కొడుకు ఇజాన్‌ను, మరో చేతిలో టెన్నిస్‌ రాకెట్‌ను పట్టుకుని టెన్నిస్‌ కోర్టు నుంచి బయటకు వస్తున్నారు. ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సందర్భంగా సానియా తన కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ ఫొటోనే తాజాగా సానియా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసారు.

టీమిండియా జెర్సీ ధరించకపోవడం బాధించింది.. మానసికంగా ఎంతో కుంగదీసింది: పాండ్యాటీమిండియా జెర్సీ ధరించకపోవడం బాధించింది.. మానసికంగా ఎంతో కుంగదీసింది: పాండ్యా

ఒకే ఫొటోలో నా జీవితం:

'ఈ ఫొటోలోనే నా జీవితం. నాకు మరో మార్గం లేదు. నా పని నేను ఉత్తమంగా చేయడానికి ఇజాన్ నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు' అనే క్యాప్షన్‌ సానియా మీర్జా రాసుకొచ్చారు. ఇజానే తన సర్వస్వం అని సానియా చెప్పకనే చెప్పారు. తొలిసారి ప్లే ఆఫ్‌లో ఆడడం ఎంతో సంతోషంగా ఉంది అని కూడా సానియా పేర్కొన్నారు. సానియా తల్లిగా కొడుకు సంరక్షణతో పాటు కెరీర్‌ను కూడా బాగా సమన్వయం చేసుకుంటుంది.

ఫెడ్‌ కప్‌కు ఇజాన్‌:

ఫెడ్‌ కప్‌కు ఇజాన్‌:

ఇటీవలే దుబాయ్‌లో జరిగిన ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సందర్భంగా సానియా తన కొడుకు ఇజాన్‌ను అక్కడకు తీసుకెళ్లారు. విరామం దొరికినప్పుడల్లా కొడుకుకు కోసం సమయం వెచ్చించారు. మార్చి 8న ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2-1తో విజయం సాధించి తొలిసారి వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించింది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో తలపడిన ఈ టోర్నీలో సానియా, రుతుజా, అంకిత, రియా భాటియా, సౌజన్య భవిశెట్టిలతో కూడిన భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఏప్రిల్‌లో జరగనున్న ప్లే ఆఫ్‌లో లాత్వియా లేదా నెదర్లాండ్స్‌ జట్టుతో భారత్‌ ఆడుతుంది.

భార్యకు బానిస అనేవారు:

భార్యకు బానిస అనేవారు:

ఆసీస్ క్రికెటర్, భార్య ఎలీసా హేలీ ఆటను చూసేందుకు దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న మిచెల్‌ స్టార్క్‌ ఆస్ట్రేలియాకు రావడంపై సానియా సరదాగా స్పందించారు. స్టార్క్‌ చేసిన పనికి ఉపఖండంలో అయితే అతడిని భార్యకు బానిస అనేవారు అని ట్వీట్‌ చేసింది. 'కచ్చితంగా చెప్పగలను. ఉపఖండానికి (భారత్‌, పాక్‌, బంగ్లాదేశ్‌) చెందిన వ్యక్తి (స్టార్క్‌) అయితే మరు క్షణంలోనే 'జోరూ కా గులాం' (భార్యకు బానిస) అని అనేవారు. స్టార్క్‌ మంచి పనిచేశాడు' అని సానియా ట్వీట్‌ చేసారు.

2010లో వివాహం:

2010లో వివాహం:

గతంలో భర్తతో సానియా ఎదుర్కొన్న వివాదాల కారణంగానే ఆమె ఇలా (భార్యకు బానిస) అని ఉండొచ్చు. ప్రపంచకప్ 2019 సందర్భంగా పాక్ జట్టుకు మ్యాచ్ ఉందనగా.. ఆ ముందు రోజు భర్తతో కలిసి బయటి వెళ్లి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. సానియా మీర్జా తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నారు. 2010లో పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సానియాకు కొడుకు ఉన్నాడు.

Story first published: Thursday, March 12, 2020, 16:19 [IST]
Other articles published on Mar 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X