హైదరాబాద్: వింబుల్డన్ విజయంతో తన కల నెరవేరిందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. ఇటీవల జరిగిన వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను మరో క్రీడాకారిణి మార్టీనా హెంగిస్‌తో కలిసి ఆమె గెలుచుకున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆమె మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించడం సరికొత్త అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ అభినందలు తనకు మరింత ప్రోత్సహాన్ని కలిగించినట్లు తెలిపారు.

వింబుల్డన్ విజయాన్ని దేశ ప్రజలకు అంకితమిస్తున్నట్లు చెప్పారు. అపజయాలకు కుంగిపోలేదని.. అదే తన విజయ రహస్యమని తెలిపారు. వింబుల్డన్ గెలవడం వెనుక పదేళ్ల శ్రమతో పాటు దేశ ప్రజల ప్రోత్సాహం ఉందన్నారు. తన విజయంలో మార్టీనా హెంగిస్ సహకారం చాలా ఉందని చెప్పారు.