న్యూఢిల్లీ: నా భర్త షోయబ్ మాలిక్ భారత్ వచ్చినప్పుడు తాను ఇక్కడ లేకపోవడం తనను నిరాశకు గురి చేసిందని టెన్నిస్ తార సానియా మీర్జా సోమవారం అన్నారు. ప్రస్తుతం తన కెరీర్‌లో గోల్డెన్ డేస్ నడుస్తున్నాయని ఆమె అన్నారు. తాను వచ్చే ఒలింపిక్స్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని చెప్పారు.
వచ్చే ఒలింపిక్స్ దాకా ఆడుతూ ఉంటే తాను అప్పడి ఒలింపిక్స్‌లో పాల్గొంటానని చెప్పారు. ఏషియన్ గేమ్స్‌లో రెండు పతకాలు రావడంతో తనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందన్నారు. గత రెండు నెలల కాలం తనకు అద్భుతమన్నారు. తాను భారత్‌లో అడుగు పెట్టిన ఈ సమయం... ఏ నెల, ఏ తేదీ అనేది కూడా తెలియకుండా పోయిందన్నారు.
ఏషియన్ గేమ్స్ ఆడాలనుకోవడం సరైన నిర్ణయమన్నారు. కాగా, సానియా, సాకేత్ మైనేని జోడి భారత్‌కు స్వర్ణం అందివ్వగా, ప్రార్థన, సానియాల జోడీ కాంస్యాన్ని అందించింది.

మగ రెజ్లర్‌ను మట్టికరిపించిన 17 ఏళ్ల బాలిక
రెజ్లింగ్‌లో 17 ఏళ్ల బాలిక సంచలనం సృష్టించింది. ఉత్తరాఖండ్ టీనేజర్ నేహా తోమర్.. తన కంటే శక్తిమంతుడు, అనుభవజ్ఞుడైన మల్లయోధుడు సోనూ పైల్వాన్‌ను మట్టికరిపించి తోటి రెజ్లర్లు, ప్రేక్షకులను ముక్కున వేలేసుకునేలా చేసింది.
ఉత్తరప్రదేశ్, జోగి నవడా జిల్లాలో ప్రతి ఏడాది నిర్వహించే కుస్తీ పోటీల్లో భాగంగా ఉత్తరాఖండ్, రుద్రాపూర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక నేహా తోమర్ పురుష రెజ్లర్లకు సవాల్ విసిరింది. ఉత్తరాఖండ్‌కే చెందిన సోనూ పైల్వాన్ పోటీకి సిద్ధపడ్డాడు. ప్రేక్షకుల మద్దతు మధ్య నేహా.. తన కంటే 16 కిలోల ఎక్కు బరువు, అనుభవం ఉన్న సోనూను 10 నిమిషాల్లోనే మట్టికరిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.