హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని అభిమానులకు సానియానే తెలియజేశారు. త్వరలోనే తమ జీవితంలోకి ఓ బేబీ రాబోతుందని సానియా మిర్జా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
#BabyMirzaMalik అనే హ్యాష్ ట్యాగ్‌తో తాను గర్భం దాల్చిన శుభవార్తను ఆమె ట్విట్టర్లో పోస్టు చేశారు. సానియా పోస్టుకు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి తెగ లైక్స్, కామెంట్స్ వచ్చాయి.
ఆమె దీనిని అబిమానులతో పంచుకున్న గంటలోపే 54 వేల మంది లైక్ చేశారు. 1,502 మంది కామెంట్స్ చేశారు. ఇది నిజంగా శుభవార్తని ఆనందం వ్యక్తం చేశారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పాకిస్తాన్‌కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో వివాహం చేసుకున్నారు.
#BabyMirzaMalik 👶🏽❤️ pic.twitter.com/RTYpqok1Vl
— Sania Mirza (@MirzaSania) April 23, 2018
ఇటీవల ఓ ఇంటర్యూలో సానియా మాట్లాడుతూ 'నేను ఈ రోజు మా కుటుంబ రహస్యం చెప్పాలనుకుంటున్నా. మాకు సంతానం ఎప్పుడు కలిగినా వారి పేర్లలో మా ఇంటి పేర్లు వచ్చేలా 'మీర్జా మాలిక్'ను జోడించాలని నేను, మా ఆయన నిర్ణయించుకున్నాం. నిజానికి షోయబ్ కూడా అమ్మాయే కావాలని ఆశిస్తున్నాడు' అని అన్నారు.
😂😂😂😂 Can't stop Laughing pic.twitter.com/KazUVeTb4K
— Sanju💪TOH❤️ (@RanbirAamirfc) April 23, 2018