Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అజహరుద్దీన్ కొడుకును పెళ్లాడనున్న సానియా మిర్జా సోదరి?

Sania Mirzas Sister to Tie Knot with Mohd Azharuddins Son?

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా త్వరలో వివాహం చేసుకోబోతున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొలంగా అసద్, ఆనమ్‌లు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తన మాజీ భర్త అక్బర్ రషీద్‌ నుంచి గతేడాది ఆమె విడాకులు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆనమ్‌కు కోర్టు నుంచి విడాకులు మంజూరు అనంతరం అసద్‌తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు ఈ మధ్యే వార్తలు కూడా వచ్చాయి. ఈ ప్రేమను పెళ్లిగా మార్చుకునేందుకు ఇద్దరూ సిద్ధమైనట్లు సమాచారం.

సన్నిహిత వ్యక్తుల సమాచారం ప్రకారం

మీడియా కథనాలు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహిత వ్యక్తుల సమాచారం ప్రకారం అసద్, ఆనమ్ ప్రేమలో ఉన్నారు. అయితే, వాళ్ల కుటుంబాలు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఏడాది ఆఖర్లో ఇద్దరూ పెళ్లిన చేసుకోనునట్లు తెలుస్తోంది.

అసద్‌తో కలిసి ఆనమ్ దుబాయ్‌లో షాపింగ్

అసద్‌తో కలిసి ఆనమ్ దుబాయ్‌లో షాపింగ్ చేసినప్పటి ఫొటోలను తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడం పెండ్లి వార్తలకు మరింత బలాన్ని తీసుకొచ్చింది. 25 ఏళ్ల ఆనమ్‌ మిర్జా 2016లో అక్బర్‌ రషీద్‌ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

భర్త నుంచి విడాకుల కోసం ఆనమ్ మిర్జా!

భర్త నుంచి విడాకుల కోసం ఆనమ్ మిర్జా!

అయితే, ఏమైందో తెలియదు గానీ రషీద్‌ నుంచి ఆమె విడాకులు కోసం తీసుకునేందుకు దరఖాస్తు చేసినట్లు గతేడాది వార్తలు వచ్చాయి. మరోవైపు మహ్మద్ అజహరుద్దీన్‌కు ఇద్దరు కుమారులు కాగా, ఒకరు ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన బైక్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, March 7, 2019, 12:37 [IST]
Other articles published on Mar 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+