Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆనమ్ త్రోబాక్ డ్యాన్స్ వీడియో.. పంచ్ ఇచ్చిన సానియా మీర్జా!!

Sania Mirzas sister Anam shares BTS video of wedding celebrations. Tennis stars comment takes the cake

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్‌, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా వివాహం గతేడాది డిసెంబర్ 11న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మూడు రోజులపాటు గ్రాండ్‌గా జరిగిన వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో మునిగితేలారు సానియా, అన‌మ్ స్నేహితులు. అయితే తాజాగా పెళ్లికి సంబంధించిన ఓ వీడియోని ఆనమ్ మిర్జా తన .ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

ఆనమ్ త్రోబాక్ డ్యాన్స్ వీడియో

వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ సమయంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హౌస్‌ఫుల్-4 చిత్రంలోని సూప‌ర్ హిట్ ట్రాక్ 'బాలా' సాంగ్‌కు త‌న స్నేహితులు, కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆనమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'ప్రతి ఒక్కరూ ఈ వ్యాఖ్యను మిస్ అవుతున్నారు' అని ఓ ఎమోజీని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పంచ్ ఇచ్చిన సానియా

పంచ్ ఇచ్చిన సానియా

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆనమ్ షేర్ చేసిన వీడియోను సానియా మీర్జా చూసి త‌న‌దైన్ శైలిలో స్పందించింది. వీడియోలో ఉన్న‌వారు చాలా ద‌గ్గ‌ర‌గా ఉండి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల‌కు (కరోనా వైరస్) వ్య‌తిరేకంగా ఉంది. దీంతో సానియా ఓ రిక్వెస్ట్ ఎమోజితో పాటు 'సోష‌ల్ డిస్టేన్సింగ్' అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. సామాజిక దూరాన్ని పాటించాలని సానియా తన చెల్లెలికి సరదాగా పంచ్ ఇచ్చింది. ఈ పోస్టుకు గంట‌లోనే పెద్ద సంఖ్య‌లో లైకులు, కామెంట్లు రావ‌డం విశేషం.

పెద్దల అంగీకారంతో పెళ్లి

పెద్దల అంగీకారంతో పెళ్లి

25 ఏళ్ల ఆనమ్‌ మిర్జా 2016లో అక్బర్‌ రషీద్‌ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పరిణితి చోప్రా తదితరులు పాల్గొని సందడి చేశారు. అయితే.. ఏమైందో తెలియదు గానీ రషీద్‌ నుంచి ఆనమ్‌ విడాకులు తీసుకుంది. కొంతకాలం పాటు అసద్, ఆనమ్‌లు ప్రేమలో మునిగితేలారు. ఈ ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు అసదుద్దీన్-ఆనమ్‌లు తీసుకెళ్లారు. మరోవైపు అజహరుద్దీన్‌కు ఇద్దరు కుమారులు కాగా.. ఒకరు ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.

సాయం చేయాల్సింది పోయి

సాయం చేయాల్సింది పోయి

క‌రోనా‌పై పోరాటానికి సానియా తనవంతు సాయాన్ని ప్రకటించింది. పూట గ‌డువ‌ని ప‌రిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నకుటుంబాలను ఆదుకునేందుకు ఈ హైదరాబాద్ టెన్నిస్ స్టార్ 1.25 కోట్లను విరాళాలుగా సేక‌రించింది. వీటి ద్వారా అన్నార్థుల‌కు స‌హాయం చేస్తుంది. కరోనాతో చాలా మంది ఆకలితో అలమటిస్తుంటే.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం చేయాల్సింది పోయి వంటావార్పులు చేసుకుంటూ వీడియోలు షేర్ చేస్తున్న సెలబ్రిటీలపై సానియా మీర్జా ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Story first published: Thursday, April 9, 2020, 15:31 [IST]
Other articles published on Apr 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+