హైదరాబాద్: హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా నివాసంలో ఆనందం వెల్లివిరుస్తోంది. టెన్నిస్ క్రీడలో ఒక్కొక్క మెట్టే పైకి ఎగబాకుతూ అవార్డుల పంట పండించుంటున్న సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా పెళ్లి ఖరారైంది.
రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి సానియా పేరును అవార్డుల కమిటీకి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు ఆ పురస్కారం దక్కడం ఖాయమైంది. కాగా, సానియా చెల్లెలు ఆనం మీర్జా వివాహం ఖరారైంది. హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త అక్బర్ రషీద్‌తో ఆమె వివాహం జరగనుంది.

సెప్టెంబర్ 16వ తేదీన ఆనం మీర్జా నిఖా జరగనుంది. దీంతో సానియా నివాసంలో పెళ్లి సందడి చోటు చేసుకుంది. వధువు ఆనం మీర్జా షాపింగ్ కోసం ఇప్పటికే ముంబై వెళ్లింది. ఇరు కుటుంబాలు ఇప్పటికే పెళ్లి పనుల్లో మునిగిపోయాయి.
ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, అబూ సందీప్ ఆనం మీర్జా వెడ్డింగ్ డ్రెస్‌ను ఎంపిక చేస్తారు. ఆనం మీర్జా హైదరాబాదులోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో మాస్ కమ్యునికేషన్ డిగ్రీ పూర్తి చేశారు.