Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అస‌దుద్దీన్‌ను పెళ్లి చేసుకున్న సానియా చెల్లెలు.. సంగీతా బిజ్లానీ సందడి!!

Sania Mirzas sister Anam marries Mohd Azharuddins son Asaduddin in Hyderabad

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్‌, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అసదుద్దీన్-ఆనమ్ మిర్జాల వివాహం హైదరాబాద్‌లో బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విషయాన్ని అసద్, ఆనమ్ తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల ద్వారా తెలిపారు.

నా ప్రేమను వివాహం చేసుకున్నా:

బుధవారం రాత్రి ఆనమ్ మీర్జా 'మిస్టర్ అండ్ మిసెస్' అనే కాప్షన్ పెట్టి పెళ్లి ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. మరోవైపు 'చివరకు నా జీవితంలోని ప్రేమను వివాహం చేసుకున్నా' అని అసదుద్దీన్‌ రాసుకొచ్చాడు. పెళ్లి వేడుకలో గులాబీ రంగు లెహంగా, వైన్ రంగు దుపట్టా, బంగారు ఆభరణాలతో ఆనమ్ మీర్జా అందంగా ఉన్నారు. వరుడు అసద్ క్రీమ్ కలర్ షెర్వానీతో పాటు తలపాగా పెట్టుకుని ఆకర్షించాడు.

సోషల్ మీడియాలో వైరల్:

అసదుద్దీన్-ఆనమ్ ఇద్దరూ పెళ్లి పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. అందరూ నూతన దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు నెటిజన్లు లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. 'పెళ్లి శుభాకాంక్షలు' అని ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అని మరో నెటిజన్ పోస్ట్ చేసాడు.

సంగీతా బిజ్లానీ సందడి:

అస‌దుద్దీన్ పెళ్లి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని అత‌ని ఇంటిని విద్యుత్తు దీపాల‌తో అందంగా డెక‌రేట్ చేశారు. బుధ‌వారం రాత్రి అజ‌ర్ ఇంటి వ‌ద్ద కుటుంబ‌ స‌భ్యుల కోలాహ‌లం నెలకొంది . ఈ వేడుక‌లో అజ‌ర్ మాజీ భార్య సంగీతా బిజ్లానీ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. పెళ్లి కుమారుడిని హోట‌ల్‌కు తీసుకువెళ్తున్న స‌మ‌యంలో అసదుద్దీన్‌కు సంగీతా స్వాగ‌తం ప‌లికారు. గ్రీన్ చుడీదార్‌లో వ‌చ్చిన సంగీతా కాసేపు సందడి చేశారు.

సానియా హొయలు:

మంగళవారం ఆనమ్‌ మీర్జా మెహందీ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. మెహందీ వేడుకలో సానియా మిర్జా, ఆనమ్ మిర్జా సందడి చేశారు. ముఖ్యంగా సానియా తనదైన వస్త్రధారణతో తళుక్కుమంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో మైమరపించింది. మరోవైపు ఆనమ్ కూడా మెరిసిపోయింది. మెహందీ వేడుకకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి.

Story first published: Thursday, December 12, 2019, 12:46 [IST]
Other articles published on Dec 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+