వైరల్ ఫొటోలు.. చెల్లెలి మెహందీ వేడుకలో సానియా హొయలు!!

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా వివాహనికి ఏర్పాట్లు అంగరంగ వైభాగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అసదుద్దీన్-ఆనమ్ మిర్జా వివాహా బంధంలో ఒక్కటి కాబోతున్నారు. ఆనమ్ మీర్జా మెహందీ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు.

సానియా హొయలు:
మెహందీ వేడుకలో సానియా మిర్జా, ఆనమ్ మిర్జా సందడి చేశారు. ముఖ్యంగా సానియా తనదైన వస్త్రధారణతో తళుక్కుమంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో మైమరపించింది. మరోవైపు ఆనమ్ కూడా మెరిసిపోయింది. చిలకపచ్చ రంగు డిజైనర్ లెంహంగా, లేత నీలం రంగు ఓణీలో ఆనమ్ హొయలు పోయింది. కొత్తపెళ్లి కూతురు ఫ్యాషన్ స్టైలిస్ట్ కావడం గమనార్హం. మెహందీ వేడుకకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సానియా పోస్ట్ చేసింది.

మెహందీ రాత్రి:
'మెహందీ రాత్రి' అని సానియా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 'జీవితం అలా సాగిపోతుంటుంది. అందులో కొన్ని మధుర క్షణాలు ఉంటాయి. అలాంటి వాటిని నేను వారం రోజులుగా చూస్తున్నా. వాటితో నేను అనుభూతి చెందుతున్నా. మెహందీ వేడుకలో ఉన్న మిత్రులు, కుటుంబ సభ్యులను చూసి నేనెంత అదృష్టవంతురాలినో తెలుసుకున్నా' అని ఆనమ్ రాసుకొచ్చింది.

12న రిసెప్షన్:
అసదుద్దీన్-ఆనమ్ వివాహా రిసెప్షన్ ఈ నెల 12న జరగనుంది. ఈ రిసెప్షన్‌కు హాజరుకావాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎంను అజహరుద్దీన్, సానియామిర్జా కలిసారు. అసదుద్దీన్, సానియా వివాహ పత్రిక ఇచ్చి సీఎంను ఆహ్వానించారు. వీరివెంట సానియా తండ్రి ఉన్నారు. అనంతరం అందరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.

పెద్దల అంగీకారంతో పెళ్లి:
ఆనమ్ మిర్జాకు ఇది రెండో వివాహం. మాజీ భర్త అక్బర్ రషీద్ నుంచి ఆనమ్ విడాకులు తీసుకున్నారు. గత కొంత కాలంగా అసద్, ఆనమ్‌లు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అక్టోబర్‌లో వీటిని సానియా మీర్జా ధ్రువీకరించారు. ఈ ప్రేమ పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు వచ్చింది. మరోవైపు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌కు ఇద్దరు కుమారులు కాగా.. ఒకరు ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications