బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఒక్కసారిగా రిక్షవాలాగా మారిపోయింది. అదేంటీ, ఉన్నట్టుండి టెన్నిస్ రాకెట్ పట్టాల్సిన సానియా రిక్షావాలాగా ఎప్పుడు మారిందనుకుంటున్నారా? అదేంలేదు లేండి. సరదా కోసమే.
అయినా, కెరీర్‌లో అత్యుత్తమంగా రాణిస్తున్న సమయంలో సానియా రిక్షావాలాగా మారాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? అయినా, భర్త షోయబ్ మాలిక్ ఉండగా, సానియా ఎందుకు రిక్షా తొక్కుతుంది.

అసలు విషయానికివస్తే.. చైనా ఓపెన్ కోసం ప్రస్తుతం బీజింగ్‌లో ఉన్న సానియా, డబుల్స్‌లో తన జోడీ మార్టినా హింగిస్‌తో కలిసి ఆదివారం సరదాగా గడిపింది.
హింగిస్‌ను రిక్షాలో ఎక్కించుకుని తాను రిక్షా తొక్కుతున్నట్లు ఓ ఫొటో తీసుకుని తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. హింగిస్‌కు 'డే ఆఫ్' అయితే తనకు మాత్రం 'వర్కింగ్ డే' అంటూ సదరు పోస్ట్‌కు సానియా సరదాగా వ్యాఖ్యానించింది.