'3-4 నెలలు కుంగుబాటుకు గురయ్యా.. భోజనం చేయడానికి కూడా గది నుంచి బయటకు రాలేకపోయా'

హైదరాబాద్: మణికట్టు గాయంతో 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన తర్వాత తాను ఎంతో డిప్రెషన్‌కు లోనయ్యానని భారత వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తెలిపారు. 3-4 నెలలు తాను మానసిక సమస్యలతో సతమతమయ్యానని, ఓ నెల రోజుల పాటు భోజనం చేసేందుకు కూడా తన గది దాటకపోవడం ఇంకా గుర్తుందన్నారు. బాగానే ఉన్నానని అనిపించే లోపే కన్నీళ్లు వచ్చేవని సానియా పేర్కొన్నారు. గాయంతో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన బెనెసోవాతో తొలి రౌండ్‌ పోరు మధ్యలో సానియా వైదొలిగారు. అప్పటికి సానియా 1-6, 1-2తో వెనుకంజలో ఉన్నారు.

అంత త్వరగా జీర్ణించుకోలేకపోయా

అంత త్వరగా జీర్ణించుకోలేకపోయా

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ సందర్భాన్ని సానియా మీర్జా ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో తాజాగా గుర్తు చేసుకున్నారు. '2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో తొలి రౌండ్లోనే తప్పుకోవాల్సి రావడాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేకపోయా. కేవలం టెన్నిస్‌ అనే కాదు కోర్టు బయట విషయాల్లోనూ అది ఎంతో ప్రభావం చూపింది. చాలా సార్లు మన జీవితాల్లో ఆనందం కోసం కెరీర్‌పై అతిగా ఆధారపడతాం. ప్లేయర్లుగా కెరీర్‌ అనేది కేవలం జీవితంలో ఒక భాగమనే విషయాన్ని మర్చిపోతాం. నిజానికి అదే మన జీవితం కాదు. నిజానికి ఆ సమయంలో చాలా బాధను అనుభవించా. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకున్నా' అని సానియా తెలిపారు.

కారణం లేకున్నా ఏడ్చేదాన్ని

కారణం లేకున్నా ఏడ్చేదాన్ని

'ప్రస్తుతం 34 ఏళ్ల వయసులో నేను స్పష్టమైన మానసిక దృక్పథంతో ఉన్నా. కానీ 20లో అలా లేను. గతంలో అలా చేసి ఉండాల్సింది కాదనే విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఒలింపిక్స్‌లో తప్పుకోవడం గురించి ఎంతో ఆలోచించా. దాని కారణంగా 3-4 నెలలు కుంగుబాటుకు గురయ్యా.

ఏ కారణం లేకున్నా ఏడ్చేదాన్ని. బాగానే ఉన్నానని అనిపించే లోపే.. కన్నీళ్లు వచ్చేవి. ఓ నెల రోజుల పాటు భోజనం చేసేందుకు కూడా నా గది దాటకపోవడం ఇంకా గుర్తుంది. నేనెంతో ప్రేమించే టెన్నిస్‌ను మళ్లీ ఆడలేనేమోననే బాధ కలిగింది. ఆ వయసులోనే నా పని అయిపోయిందనిపించింది' అని సానియా మీర్జా అన్నారు.

IPL 2021 ఆతిథ్యం కోసం పోటీపడుతున్న 4 దేశాలు.. బీసీసీఐ ఆసక్తి మాత్రం అటువైపే!!

నా కుటుంబం ఎంతో సాయం చేసింది

నా కుటుంబం ఎంతో సాయం చేసింది

'ఒలింపిక్స్‌లో పోటీపడలేననే వ్యాఖ్యలు చదువుతుంటే ఎలా ఉంటుంది. ఆ మణికట్టు గాయం కారణంగా కనీసం నా జుట్టును కూడా దువ్వుకోలేకపోయా. శస్త్రచికిత్స తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో నా కుటుంబాన్ని, దేశాన్ని నిరాశపరిచానని అనిపించింది. కానీ ఆ క్లిష్టమైన దశ నుంచి కోలుకోవడంలో నా కుటుంబం ఎంతో సాయం చేసింది.

ఆ సమయంలో నాకు కావాల్సిన మనోస్థైర్యాన్ని వాళ్లు అందించారు. వాళ్ల అండతోనే త్వరగా కోలుకున్నా. ఆ తర్వాత దేశంలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో రెండు పతకాలు గెలిచా' అని సానియా మీర్జా చెప్పుకొచ్చారు. ఆసియా, కామన్వెల్త్‌, ఆఫ్రో- ఆసియా క్రీడల్లో కలిపి మొత్తం 14 పతకాలు గెలిచిన సానియా.. ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను ఖాతాలో వేసుకుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 11, 2021, 7:29 [IST]
Other articles published on May 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X