న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుగేళ్ల తర్వాత బరిలోకి.. ఫెడ్‌కప్‌ జట్టులో సానియా

Sania Mirza returns to Indian Fed Cup team after four years

ఢిల్లీ: భారత టెన్నిస్‌ స్టార్ సానియా మీర్జా సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఐదుగురు సభ్యుల భారత ఫెడ్‌కప్‌ జట్టుకు సానియా నాలుగేళ్ల తర్వాత ఎంపికైంది. భారత సింగిల్స్‌ నంబర్‌వన్‌ ప్లేయర్‌ అంకిత రైనా, రియా భాటియా, రుతుజ భోంస్లే, కమ్రన్‌ కౌర్‌ థండీతో కలిసి సానియా ఫెడ్‌కప్‌ జట్టులో భాగం కానుంది.

IPL Fantasy XI: గంగూలీ జట్టులో ధోనీకి దక్కని చోటు.. కెప్టెన్‌ ఎవరంటే!!IPL Fantasy XI: గంగూలీ జట్టులో ధోనీకి దక్కని చోటు.. కెప్టెన్‌ ఎవరంటే!!

ఫెడ్‌కప్‌ జట్టులో హైదరాబాద్‌ అమ్మాయి సౌజన్య భవిశెట్టి రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపికైంది. ఈ జట్టుకు మాజీ డేవిస్‌ కప్‌ ఆటగాడు విశాల్‌ ఉప్పల్‌ కెప్టెన్‌గా, మరో మాజీ క్రీడాకారిణి అంకితా బాంబ్రి కోచ్‌గా వ్యవహరిస్తుంది. చివరి సారిగా 2016లో ఫెడ్‌కప్‌ ఆడిన సానియా 2017 అక్టోబరు నుంచి ఆటకు దూరంగా ఉంది. గతేడాది బాబుకు జన్మనిచ్చిన సానియా.. గ్రౌండ్‌లో అడుగుపెట్టడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనా వేదికగా ఫెడ్‌కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌-1 మ్యాచ్‌లు జరుగనున్నాయి. చైనా, చైనీస్‌ తైపీ, ఇండోనేషియా, కొరియా, ఉజ్బెకిస్థాన్‌తో కలిసి బరిలో దిగనున్న భారత్‌.. రౌండ్‌రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో మిగిలిన ఐదు జట్లతో తలపడనుంది. మరి సానియా పునరాగమనంలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

2020లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌తో పాటు దానికి ముందు సన్నాహకంగా హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌లో నాదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి బరిలోకి దిగుతున్నట్లు సానియా మీర్జా ఇప్పటికే ప్రకటించింది. గత ఆరు నెలల నుండే సానియా తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన విషయం తెలిసిందే.

Story first published: Wednesday, December 25, 2019, 10:44 [IST]
Other articles published on Dec 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X