ఆస్ట్రేలియా ఓపెన్: ఆడకుండానే తప్పుకున్న సానియా

మెల్‌బోర్న్‌: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నీలో టైటిల్ నెగ్గి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడకుండానే తప్పుకుంది. ఉక్రెయిన్ పార్టనర్ నదియా కిచెనోక్‌తో కలిసి ఇటీవలే హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. కాలి పిక్కగాయంతో ఇబ్బంది పడుతుంది. దీంతోనే మెగా టోర్నీనుంచి అర్ధాంతరంగా నిష్క్రమించింది.

 రెండో సెట్‌లో..

రెండో సెట్‌లో..

తొలుత మిక్స్‌డ్ డబుల్స్ టోర్నీ నుంచి తప్పుకున్న సానియా.. గురువారం జిన్‌యున్‌ హాన్‌-లిన్‌ జు (చైనా) జోడీతో జరిగాల్సిన మహిళల డబుల్స్ మ్యాచ్ మధ్యలో వైదొలిగింది. ఈ మ్యాచ్‌లో సానియా-నదియా 2-6తో తొలి సెట్ కోల్పోయింది. అనంతరం రెండో సెట్‌లో ఫస్ట్ గేమ్ ఓడి 0-1 వెనుకంజలో నిలవగా.. సానియా గాయం ఇబ్బంది పెట్టింది. దీంతో ఆమె రిటైర్ట్ హర్ట్‌గా తప్పుకుంది. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్నతో కలిసి సానియా ఆడాల్సి ఉండగా... ఆమె తప్పుకుంది. దీంతో నదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి బోపన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆడనున్నాడు.

 అవకాశం చేజారింది..

అవకాశం చేజారింది..

‘హోబర్ట్ టైటిల్ గెలిచి ఆనందంలో ఉన్న నాకు దురదృష్టవశాత్తు ఆ టోర్నీ ఫైనల్లో గాయమైంది. దీంతో మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి ఆడే అవకాశాన్ని చేజార్చుకున్నాను. కానీప్రస్తుతంనా గాయం పర్వాలేదు. డబుల్స్‌లో నా ఉత్తమ పెర్ఫామెన్స్ ఇవ్వాలను కుంటున్నాను'అని మిక్స్‌డ్ డబుల్స్ నుంచి తప్పుకున్న అనంతరం సానియా తెలిపింది.

బిడ్డకు జన్మనివ్వడం కోసం..

బిడ్డకు జన్మనివ్వడం కోసం..

బిడ్డకు జన్మనివ్వడం కోసం రెండేళ్లకు పైగా టెన్నిస్‌కు దూరంగా ఉన్న సానియా.. పునరాగమనంలో బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే టైటిల్‌ పట్టేసి తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించింది. హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన 27 ఏళ్ల నదియా కిచెనోక్‌తో జత కట్టిన 33 ఏళ్ల సానియా డబుల్స్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఈ టోర్నీ ఫైనల్లో సానియా-కచనోవ్‌ జోడీ 6-4, 6-4తో రెండోసీడ్‌ చైనా ద్వయం షుయ్‌ పెంగ్‌-షుయ్‌ జాంగ్‌ జంటను చిత్తుచేసింది.

అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సానియా జోడీ గంటా 21 నిమిషాలలో వరుస సెట్లలో తుది పోరును ముగించింది. ఇప్పటి వరకు ఆరు గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన సానియాకు ఇది 42వ డబ్ల్యూటీఏ టైటిల్‌ కావడం విశేషం. 2017లో బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ ట్రోఫీ తర్వాత సానియా అందుకున్న మొదటి టైటిల్‌ ఇది. ఈ విజయంతో సానియా జోడీకి 13,580 డాలర్లు (రూ.9.65లక్షలు)తో పాటు ఒక్కొక్కరికి 280 ర్యాంకింగ్‌ పాయింట్లు దక్కాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, January 23, 2020, 13:01 [IST]
Other articles published on Jan 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X