న్యూయార్క్: యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టాప్ సీడ్స్ సానియా మిర్జా, బ్రూనో సోరెస్‌లు ఫైనల్‌కు చేరుకున్నారు. సమీ పైనల్లో యంగ్ జాన్ చాన్, రాస్ హచిన్స్‌పై 7-5, 4-6, 10-7 తేడాతో విజయం సాధించారు.

పైనల్లో సానియా జోడి అన్ సీడెడ్ జంట అబిగెయిల్ స్పియర్, శాంటియాగో గోంజలెజ్‌లతో తలపడనున్నారు. యుఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సానియా మిర్జా ఫైనల్‌కు చేరండం ఇదే మొదటిసారి. సెమీ పైనల్ మ్యాచ్‌లో సానియా జట్టుకు అభిగెయిల్, శాంటియాగోలు గట్టి పోటీని ఇచ్చారు. తొలిసెట్‌లో విజయం సాధించిన సానియా, బ్రూనోలకు రెండవ సెట్‌లో గట్టి పోటీ ఎదురైంది. మూడో సెట్‌లో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది.
పురుషుల సింగిల్స్ క్వార్టర్‌లో మూడవ సీడ్ స్టాన్సిలాస్ వావ్రింకా పదవ సీడ్ కీ నిషికోరి చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్, ఎక్తరీనా మకరోనా సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్స్ నుంచి అజరెంక, పెన్నెట్టా ఓటమిపాలై వెనుదిరిగారు.