అన్నార్థులకు సానియా సాయం రూ. 1.25 కోట్లు!!

హైదరాబాద్: చైనా నుండి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ ప్రమాదకర వైరస్ ప్రభావం భారత దేశంపైన కూడా బాగానే పడింది. కరోనాను ఎదురించడానికి క్రికెట్, బాడ్మింటన్, ఫుట్ బాల్, టెన్నిస్, అథ్లెట్లు ఒక్కొక్కరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జరుగుతున్న పోరాటంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగం పంచుకుంటున్నది.

సానియా సాయం రూ. 1.25 కోట్లు:
కరోనా కారణంగా పూట గడువని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నకుటుంబాలను ఆదుకునేందుకు సానియా మీర్జా రూ. 1.25 కోట్లను విరాళాలుగా సేకరించింది. వీటి ద్వారా అన్నార్థులకు సహాయం చేయనుంది. ఈ విషయాన్ని సానియా సోమవారం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 'కరోనాతో తినడానికి తిండి లేకుండా రోడ్డున పడ్డ వారి కోసం ఏమన్న చేయాలన్న తపనతో కొందరం కలిసి ఒక గ్రూపుగా ఏర్పడ్డాం. వారం వ్యవధిలో కోటి 25 లక్షలతో వేల కుటుంబాలకు అన్నదానం చేయనున్నాం. ఈ డబ్బుతో దాదాపు లక్ష మందికి సహాయం అందుతుంది. దీన్ని మేమందరం కలిసి ఇంకా కొనసాగిస్తాం. @యూత్‌ఫీడ్ఇండియా @సేఫ్ఇండియా' అంటూ సానియా ట్వీట్ చేసింది.

భారత్ గెలవాలని.. :
ఇటీవలే కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ కామెడీ షోకు సానియా మిర్జా హాజరైంది. ఈ సందర్బంగా సాగిన ఇంటర్వ్యూ ప్రేక్షకుల్లో నవ్వులు పూయించింది. కపిల్ శర్మ అడిగిన ప్రశ్నలకు సానియా చురుగ్గా సమాధానాలు ఇచ్చింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నడుస్తుంటే.. ఎవరు గెలువాలని కోరుకొంటారు అని ప్రశ్నకు సానియా సమాధానం ఇస్తూ.. ఇది అడగాల్సిన ప్రశ్నేనా? నేను ఎఫ్పుడు ఇండియానే గెలువాలని కోరుకొంటాను. కానీ నా భర్త షోయబ్ మాలిక్ మాత్రం సెంచరీ కొట్టాలని కోరుకొంటాను అని సానియా జవాబు ఇచ్చింది.

ప్రపోజల్స్ ఆగట్లేదు:
షోయబ్‌తో పెళ్లి తర్వాత లవ్ ప్రపోజల్స్ వస్తున్నాయా? లేక ఆగిపోయాయా? అని కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పెళ్లి తర్వాతనే ఎక్కువగా లవ్ ప్రపోజల్స్ వస్తున్నాయని సానియా చెప్పింది. పెళ్లి అయిన తర్వాత కూడా పట్టించుకోకుండా నాకు ప్రపోజల్స్ పంపుతున్నారని పేర్కొంది. ఏ బాలీవుడ్ హీరోయిన్ అయితే మీ జీవిత చరిత్ర తెరపై పండుతుంది అనే పశ్నకు సమాధానం ఇస్తూ.. దీపికా పదుకోన్, ప్రియాంక చోప్రా లాంటి పెద్ద స్టార్లు.. వాళ్లు చేస్తారో లేదో తెలియదు. కానీ నా క్లోజ్ ఫ్రెండ్ పరిణితి చోప్రా అయితే కరెక్ట్‌గా ఉంటుంది సానియా చెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications