సానియాకు కెసిఆర్ చెక్కు, ఆశీస్సులు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరో కోటి రూపాయలు ప్రదానం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఆమెకు చెక్కు అందజేశారు.
యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నందుకు ఆయన ఈ కోటి రూపాయల చెక్కును అందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అండతో తాను మరిన్ని విజయాలు సాధిస్తానని సానియా మీర్జా ఈ సందర్భంగా అన్నారు.
ప్రపంచంలో తెలంగాణను ఉన్నత స్థానంలో ఉంచేందుకు ప్రయత్నించానని ఆమె అన్నారు. ఇదే ప్రోత్సాహంతో తాను మరిన్ని విజయాలు సాధిస్తానని ఆమె చెప్పారు. ప్రభుత్వం అందించిన సాయానికి సానియా కృతజ్ఞతలు తెలిపారు.

సానియాకు కోటి రూపాయలు
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన సమయంలో కెసిఆర్ నుంచి కోటి రూపాయల చెక్కు అందుకున్న సానియా యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకుని మరో కోటి రూపాయల చెక్కు అందుకున్నారు.

సానియాకు కెసిఆర్ ఆశీస్సులు...
రానున్న జపాన్ ఓపెన్, చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లలో కూడా విజయం సాధించాలని సానియా మీర్జాను కెసిఆర్ దీవించారు.

ముఖ్యమంత్రి సూచన
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా తెలంగాణ కీర్తిని, హైదరాబాద్ బిడ్డగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా చాటాలని కెసిఆర్ సానియాకు సూచించారు.

మూడు గ్రాండ్ స్లామ్‌లు...
భారతరదేశంలో అత్యున్నత ర్యాంక్ సాధించిన టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా నిలిచిందని, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యుఎస్ ఓపెన్ పోటీల్లో మూడు గ్రాండ్ స్లామ్‌లు సాధించిన క్రీడాకారిణిగా కూడా సానియా రికార్డు సాధించిందని కెసిఆర్ అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications