For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విడాకుల తర్వాత సానియా మీర్జా తొలి పోస్ట్.. ఏం చెప్పిందంటే?

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలిసారిగా సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోను అభిమానులతో పంచుకుంది. అద్దంలో తనని తాను చూసుకుంటూ ఫొటోకు ఫోజిచ్చింది. దానికి 'రిఫ్లెక్ట్' అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. అయితే ఆ ఒక్క పదంలో లోతైన భావం దాగి ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

రిఫ్లెక్ట్ అంటే కేవలం ప్రతిబింబించు అనే అర్థమే రాదని, 'లోతుగా లేదా జాగ్రత్తగా ఆలోచించండి' అనే అర్థం కూడా వస్తుందని కామెంట్లు చేస్తున్నారు. తనకి వైవాహిక జీవితంలో జరిగిన ఇబ్బందుల గురించి సానియా మీర్జా ఇలా పరోక్షంగా రాసుకొచ్చిందని కొందరు నెటిజన్లు వారి ఊహలకు పనిచెప్పారు. వ్యక్తిగత జీవితంలో తనకి వచ్చిన కఠిన పరిస్థితులను సానియా అధిగమించాలని కోరుతూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Sania Mirza posted her first post on Instagram after her divorce. What did you say?

ఇటీవల షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సానియా మీర్జాను షోయబ్ మాలిక్ 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికీ షోయ‌బ్‌కు అది రెండో వివాహం కావడం గమనార్హం. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం సానియాను పెళ్లి చేసుకున్నాడు. తాజాగా పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్‌ను మాలిక్ వివాహమాడాడు.

అయితే కొద్ది నెలల కిందటే సానియా-షోయబ్ విడాకులు తీసుకున్నారని సానియా కుటుంబం వెల్లడించింది.
''సానియా తన వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా ఎప్పుడూ గోప్యంగానే ఉంచుతుంది. కానీ కొన్ని విషయాలు ఇప్పుడు పంచుకోవాల్సి వచ్చింది. షోయబ్‌ మాలిక్‌‌తో కొన్ని నెలల కిందటే సానియా విడాకులు తీసుకుంది. అలాగే షోయబ్‌ కొత్త ప్రయాణం బాగుండాలని కోరుకుంటూ సానియా శుభాకాంక్షలు తెలిపింది. ఈ సమయంలో సానియా గోప్యతకు అందరూ గౌరవం ఇవ్వాలని కోరుతున్నాం '' అని సానియా తరపున ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్న స‌నా జావేద్‌కు ఇది రెండో వివాహం. పాకిస్తాన్‌ కు చెందిన ఈ ప్ర‌ముఖ న‌టీ వయసు 28 ఏళ్లు. స‌నా అనేక టీవీ షోల్లో క‌నిపించింది. 2020లో సింగర్ ఉమైర్ జ‌స్వాల్‌ను ఆమె వివాహం చేసుకుంది. కానీ కొద్దికాలానికే ఈ దంప‌తుల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. అయితే షోయబ్ మాలిక్ మూడో పెళ్లి వేడుకకు అతని కుటుంబ సభ్యులు హాజరవ్వలేదని పాకిస్థాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా, సనా జావెద్‌ను పెళ్లి చేసుకోవడం మాలిక్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, సానియా మీర్జాతో విడాకులు తీసుకోవడాన్ని వారు సహించలేదని వార్తలు వచ్చాయి.

Story first published: Friday, January 26, 2024, 10:40 [IST]
Other articles published on Jan 26, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+