సానియా మీర్జా: స్కర్ట్‌ల నుంచి పెళ్లి వరకు..

తన ఆత్మకథలో స్కర్ట్‌ల అంశంపై "ఫత్వా" మొదలు పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో పెళ్లి వరకు ప్రతి విషయాన్ని పొందుపరుస్తుందట. క్రీడాకారిణిగా ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న సానియా మీర్జా తన మనోభావాలను స్వీయచరిత్ర ద్వారా వెల్లడించాలని నిర్ణయించుకుంది.
కెరీర్‌కు సంబంధించిన విశేషాలు, అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగిన తీరు, సంఘర్షణ.... తదితర అంశాలతో పాటు తరచూ ఎదుర్కొన్న వివాదాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావన ఉంటుందని సానియా చెప్పింది. స్కర్ట్‌లు ధరించి టెన్నిస్ ఆడుతున్నందుకు ఆమెపై ముస్లిం పెద్దలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఫత్వా కూడా జారీ చేశారు.
తన ఆటో బయోగ్రఫీకి సానియా మీర్జా 'అగెనైస్ట్ ఆల్ ఆడ్స్...' (అడ్డంకులను అధిగమించి) అనే పేరును ఖరారు చేసింది. దాదాపు పూర్తి కావచ్చిన ఈ పుస్తకం త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది. ఆమె ఆటోబయోగ్రఫీకి ఎక్కడ లేని గిరాకీ ఉంటుందనే విషయంలో సందేహం అక్కర్లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications