చెన్నై: టెన్నిస్ తార సానియా మీర్జా ఇటీవల హీరోహీరోయిన్లు శింబూ, త్రిషలతో కలిసి పార్టీ చేసుకుంది. ఈ పార్టీని త్రిష ఇచ్చింది. ఈ విషయాన్ని త్రిష స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, ఆ పార్టీకి సంబంధించిన తమ ముగ్గురుతో కూడిన సెల్ఫీని కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఇటీవల ఓ ప్రముఖ మేగజీన్ త్రిషను దివా ఆఫ్ సౌత్‌గా పేర్కొంటూ అవార్డు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా హాజరైంది. ఈ సందర్భంగా మేగజీన్ యాజమాన్యం సానియా మీర్జాను సన్మానించింది.

ఆ కార్యక్రమం ముగియగానే సానియా మీర్జా, శింబూలను త్రిష తన ఇంటికి తీసుకు వెళ్లారు. త్రిష ఆహ్వానం మేరకు శింబూతో పాటు సానియా మీర్జా కూడా త్రిష ఇంటిలో జరిగిన పార్టీకి హాజరైంది. పార్టీలో తాము ముగ్గురం బాగానే ఎంజాయ్ చేశామని త్రిష చెప్పింది. సానియా, శింబూలతో తమ ఇంట్లో జరిగిన పార్టీలో మంచి ఫన్ వచ్చిందని త్రిష చెప్పారు.
కాగా, ఇటీవల సింగపూర్‌లో జరిగిన డబ్ల్యూటీఏ పైనల్లో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా జోడీ విజయం సాధించింది. అక్టోబర్ 26వ తేదీన జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండో సీడ్ షువాయ్ పెంగ్ (చైనా), సువేసీ (చైనీస్ తైపీ)పై సానియా మీర్జా, కారా బ్లాక్ జోడీ గెలుపొందింది. తుదిపోరులో ఢిఫెండింగ్ ఛాంపియన్స్ సువేసీ (చైనీస్ తైపీ), షువాయ్ పెంగ్ (చైనా)లపై 6-1, 6-0లోత ఓడించి సానియా మీర్జా, కారా బ్లాక్ విజేతలుగా నిలిచారు.
గతంలో వేరు వేరు భాగస్వాములతో ఈ టోర్నీని రెండు సార్లు నెగ్గిన కారా బ్లాక్‌కు ఇది మూడో టైటిల్ కావడం విశేషం. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్‌లో తొలిసారి డబ్ల్యూటీఏ టైటిల్‌ను సాధించింది. అంతకుముందు ఇంచియాన్లో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్ టైటిల్ కైవసం చేసుకుంది.