For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రికెట్.. టెన్నిస్ కాదు నా బిడ్డ డాక్టర్ కావాలనుకుంటున్నా: సానియా

Sania Mirza opens up about her marriage to Shoaib Malik, child and India-Pakistan ties

హైదరాబాద్: భారత్‌లో ఎందరినో టెన్ని‌స్‌ను క్రీడగా ఎంచుకునేందుకు ప్రేరణగా నిలిచిన గొప్ప క్రీడాకారిణి సానియా మీర్జా. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె భవిష్యత్‌లో తన బిడ్డ ఏ క్రీడలో రాణిస్తే చూడాలనుకుంటోంది? టెన్నిస్‌లోనా, క్రికెట్‌లోనా.. ? ఇదే ప్రశ్నను సానియా ముందుంచితే ఆమె నుంచి ఊహించని సమాధానంతో షాక్ ఇచ్చింది.

'భవిష్యత్‌లో మీ బిడ్డ ఏ క్రీడను ఎంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు.. అప్పుడు ఏ దేశం తరఫున ఆడిస్తారు' అని ఓ మాగజైన్‌ ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధి అడగగా.. తన చిన్నారిని అసలు స్పోర్ట్స్‌స్టార్‌గానే చూడాలనుకోవడం లేదని సానియా బదులిచ్చింది. తన బిడ్డ గొప్ప డాక్టర్‌ కావాలని కోరుకుంటున్నట్టు ఆమె వెల్లడించింది. ఇక, తన బిడ్డ జాతీయత గురించి అస్సలు ఆలోచించడం లేదన్న సానియా.. ఒకవేళ ఆ సమస్య తలెత్తితే మూడో దేశాన్ని ఎంచుకుంటానని చెప్పడం గమనార్హం.

కాగా, తమకు ఎవరు పుట్టినా ఓకేనన్న సానియా.. భర్త షోయబ్‌ మాలిక్‌ మాత్రం ఆడపిల్లనే కావాలనుకుంటున్నట్టు తెలిపింది. ప్రస్తుతం సానియా ఏడో నెలల గర్భవతి. కాగా భారత్-పాకిస్థాన్ అంటేనే చాలామంది వైరం అనుకుంటున్నారని...కానీ ఆ భావన సరికాదని సానియా మీర్జా తెలిపింది. చాలా మంది ప్రజలు ఈ భావనను కలిగి ఉన్నారని, తాను రెండు దేశాలని ఐక్యపరచడానికి వివాహం చేసుకున్నాను.

తాను పాకిస్థాన్‌కు వెళ్తే.. ఆ దేశ చట్టాల ప్రకారం నడుచుకుంటా. ప్రతీ ఏడాది అక్కడి వెళ్తా. ఆ దేశ ప్రజల ప్రేమ అపారమైనది. మొత్తం దేశం తనను బాబీ అని పిలుస్తుంది. పాకిస్థానీయులు తనకు ఎంతో గౌరవం ఇచ్చారు. పాకిస్థాన్ క్రికెటర్ అయిన షోయబ్‌ పట్ల గల గౌరవాన్ని.. ఆ దేశ ప్రజలు తనపై చూపుతున్నారని, అదే తరహాలో షోయబ్ ఇక్కడకు వచ్చినప్పుడు తన దేశ ప్రజలు కూడా ప్రేమ, గౌరవాన్ని పొందుతాడని సానియా క్లారిటీ ఇచ్చింది.

Story first published: Monday, August 13, 2018, 12:19 [IST]
Other articles published on Aug 13, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+