జోరు: భర్త కోసం శ్రీలంకలో వాలిన సానియా
హైదరాబాద్: లండన్‌లో జరిగిన వింబుల్డన్ విజయంతో జోరు మీదున్న హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కోసం శ్రీలంకలో వాలారు. శుక్రవారం రాత్రి ఆమె శ్రీలంకకు బయలుదేరి వెళ్లారు. ఈద్‌ను భర్త మాలిక్‌తో జరుపుకోవడానికి ఆమె శ్రీలంక వెళ్లారు. ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న క్రికెట్ సిరీస్‌లో షోయబ్ మాలిక్ ఆడుతున్నాడు.
షోయబ్‌తో ఈద్ తనకు అత్యంత ప్రత్యేకమైందని, ఇటువంటి అవకాశం తనకు ఎప్పుడో గానీ రాదని, అదృష్టవశాత్తు తనకు సమయం చిక్కిందని, టెన్నిస్ కార్యక్రమాలు లేకపోవడంతో ఆ సమయం చిక్కిందని, ప్రస్తుతం తన కెరీర్ పట్ల సంతోషంగా ఉన్నానని ఆమె దక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రికతో చెప్పారు.

సానియా అందరికీ ఈద్ ముబారక్ కూడా చెప్పారు. తెలంగాణ, దేశ ప్రజలకు ప్రత్యేకంగా హైదరాబాదు ప్రజలకు రంజాన్ పర్వదినం శాంతిని, సంపదను, అమితమైన ప్రమేను, సంతోషాన్ని పంచాలని ఆమె కోరుకున్నారు. పాకిస్తాన్, శ్రీలంక మధ్య ఆదివారం మూడు వన్డే మ్యాచ్ జరుగుతుంది.
షోయబ్‌తో ఆమె ఈద్ పర్వదినాన్ని జరుపుకుని కొలంబోలో జరిగే మూడో వన్డే మ్యాచును వీక్షించే అవకాశం ఉంది. షోయబ్ బుధవారం జరిగిన రెండో వన్డేలో అర్థ సెంచరీ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications