నా బెడ్రూం విషయాలు మీకెందుకంటూ సానియా
ముంబై: తన బెడ్రూంలో ఏం జరుగుతుందో అడిగే హక్కు ఎవరికీ లేదంటూ హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కాస్తా ఘాటుగా స్పందించారు. బిబీసి చానెల్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆ మాటలన్నారు. సానియా మీర్జా 2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే.
'మీరు ఎప్పుడు తల్లి అవుతార'ని బీబీసీ చానెల్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆమె కాస్తా అసహనానికి గురైనట్లు కనిపించారు. దాంతో "నా బెడ్‌రూమ్‌లో ఏం జరుగుతుందో అడిగే హక్కు ఎవరికీ లేదు" అని ఘాటుగా స్పందించారు.

క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధించే భారత్‌లో టెన్నిస్‌కు సైతం గుర్తింపు దక్కిందంటే ఆ ఘనత సానియా మీర్జాకే దక్కుతుంది. భారత నెంబర్‌వన్ క్రీడాకారిణి అయిన సానియా తన ఆటతీరుతో దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది.
ఎక్కడలేని ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమతో మహిళల డబుల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్‌వన్ ప్లేయర్‌గానూ నిలిచింది. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ఆమె ఈ ఏడాది పది టైటిళ్లు సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications