Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సానియా మిర్జా ఫేవరేట్ క్రికెటర్ ఎవరో తెలుసా?

Sania Mirza names her favourite Indian cricketer and it's not Virat Kohli or MS Dhoni

హైదరాబాద్: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సానియా మిర్జా కూడా ఏ మాత్రం తడబడకుండా సమాధానమివ్వడం విశేషం. '#sananswers' పేరిట బుధవారం సానియా మిర్జా ట్విట్టర్‌లో అభిమానులడిగిన కొన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చింది.

ఇందులో భాగంగా హారిష్ అనే అభిమాని మీ అభిమాన క్రికెటర్‌ ఎవరు? (షోయబ్ మాలిక్ కాకుండా) అని అడిగాడు. ఇందుకు సానియా ఠక్కున సచిన్ టెండూల్కర్ అని ట్వీట్ చేసింది. అలాగే శ్రీలంక క్రికెటర్లలో ఎవరు ఇష్టమని అడగ్గా కుమార సంగాక్కర అని బదులిచ్చింది.

తనకు వంట చేయడం రాదని, హైదరాబాద్‌లో తన ఇల్లే తనకు ఇష్టమైన ప్రదేశమని సానియా మిర్జా చెప్పుకొచ్చింది. ఖాళీ దొరికితే మాల్దీవుల్లో గడపడం ఇష్టమని, బిర్యానీ ఫేవరేట్‌ ఫుడ్‌ అని, పాటలు పాడటం అంటే ఇష్టమని, అర్జిత్‌ సింగ్‌ తన ఫేవరెట్‌ సింగర్‌ అని తెలిపింది.

టెన్నిస్ సింగిల్స్‌లో రోజర్‌ ఫెదరర్‌ అంటే తనకు ఇష్టమైన ఆటగాడని తెలిపింది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించాడు. భారత్ తరుపున 200 టెస్టులాడిన సచిన్ 53.79 యావరేజితో 15921 పరుగులు చేశాడు.

టెస్టుల్లో ఆరు డబుల్ సెంచరీలతో పాటు 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. భారత్ తరుపున సచిన్ ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడటం విశేషం. అందులో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. నవంబర్ 16, 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 7, 2017, 11:50 [IST]
Other articles published on Dec 7, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+