భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విస్ దిగ్గజం మార్టినా హెంగీస్ జోడీ వరుసగా రెండో టైటిల్ దక్కించుకుంది. ఆదివారం జరిగిన మియామి ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా-హెంగీస్ జోడీ రష్యాకు చెందిన మకరోవా, వెస్నినా జోడీపై 7-5, 6-1 తేడాతో విజయం సొంతం చేసుకుంది.

ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ వరుస గేమ్స్‌తో చెలరేగి ఆడిన సానియా జోడీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సానియా జోడీ ఫైనల్లో గెలిచి డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
టైటిల్ గెలిచిన అనంతరం సానియా మాట్లాడుతూ.. టైటిల్ గెలిచేందుకు తమ జోడీ చాలా కష్టపడిందని తెలిపింది. గత వారం తమకు చాలా కలిసి వచ్చిందని తెలిపింది. ఓ సెట్‌లో మేము 4 గేమ్స్ ఎప్పుడూ కోల్పోలేదని చెప్పింది. అయితే ఫైనల్లో మాత్రం గట్టి పోటీ ఎదురైందని తెలిపింది. కాగా, సానియా తండ్రి ఇచ్చిన మెళకువలు కూడా తమ విజయానికి కారణమని హెంగీస్ తెలిపింది.