Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్‌ అభినందన (ఫోటోలు)

న్యాయార్క్: ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తన కెరీర్‌లో మరో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం మార్టినా హింగిస్‌తో కలిసి కెరీర్‌లో వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది.

సానియాకు ఇది ఐదో గ్రాండ్ స్లామ్. వీటిలో డబుల్స్‌లో 2, మిక్స్‌డ్‌లో 3 ఉన్నా యి. కాగా, స్విస్‌ భామ హింగిస్‌కిది 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. ఈ 20లో సింగిల్స్‌లో 5, మిక్స్‌డ్‌లో 4, డబుల్స్‌లో 11 ఉన్నాయి. జులైలో మార్టినా హింగిస్‌తోనే కలిసి సానియా మిర్జా వింబుల్డన్ టోర్నీ డబుల్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

 సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్‌ అభినందన

సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్‌ అభినందన

ఆదివారం జరిగిన యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సానియా మిర్జా-మార్టినా హింగిస్ జోడీ 6-3, 6-4 తేడాతో నాలుగో సీడ్ కేసీ డెలాక్వా (ఆస్టేలియా) - యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జోడీని ఓడించింది. యుఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన సానియా మిర్జా-మార్టినా హింగిస్ జోడీకి 5 లక్షల 70 వేల డాలర్ల ప్రైజ్ మనీ (రూ. 3 కోట్ల 77 లక్షలు) లభించింది.

సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్‌ అభినందన

సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్‌ అభినందన

70 నిమిషాల పాటు జరిగిన ఫైనల్స్‌లో సానియా మిర్జా జోడీ మంచి ప్రదర్శనను కనబర్చింది. తొలిసెట్‌ నాలుగో గేమ్‌లో బ్రేక్‌ సాధించిన ఇండో-స్విస్‌ ద్వయం 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ మరుసటి గేమ్‌ను సానియా కోల్పోయింది. కానీ, ఆరో గేమ్‌లో మరో బ్రేక్‌ సాధించి ఆధిక్యాన్ని 4-2కి పెంచుకుంది.

 సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్‌ అభినందన

సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్‌ అభినందన

అదే జోరులో 6-3తో తొలిసెట్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండోసెట్‌ను కూడా సానియా-హింగిస్‌ జోడీ దూకుడుగానే ఆరంభించింది. తొలిగేమ్‌ను బ్రేక్‌ చేసి టైటిల్‌ దిశగా వడివడిగా సాగుతూ ఆరు గేమ్‌లు ముగిసేసరికి 4-2తో ఆధిక్యంలో నిలిచింది. ఇక కీలకమైన ఏడో గేమ్‌లో అద్భుతమైన రిటర్న్‌ షాట్లతో అలరించిన సానియా జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 5-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

 సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్‌ అభినందన

సానియాకు ఐదో గ్రాండ్ స్లామ్: కేసీఆర్‌ అభినందన

ఆ తర్వాత చాంపియన్‌షిప్‌ కోసం హింగిస్‌ సర్వీస్‌ చేసింది. కానీ, ఆ గేమ్‌ను కోల్పోయింది. అయితే తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ నిలబెట్టుకోవడంలో విఫలమైన డెలెకా-ష్వెదోవా ద్వయం మ్యాచ్‌తోపాటు చాంపియన్‌షిప్‌ను కూడా సమర్పించుకుంది.

ఈ విజయంపై సానియా మిర్జా మాట్లాడుతూ 'ఈ ఏడాది అన్నీ కలిసొచ్చాయి. ప్రపంచ నంబర్‌వన్ అయ్యాను. వింబుల్డన్ టైటిల్ కూడా గెలిచాం. ఇప్పుడు యూఎస్ ఓపెన్ సాధించాం. గతేడాది ఇదే వేదికపై మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలిచా. ఫైనల్‌కు ముందు మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. సహజసిద్ధమైన ఆటను ఆడాం. హింగిస్ మంచి ప్రోత్సాహమిచ్చింది. ఆర్థర్ యాష్ స్టేడియంలో అభిమానుల మద్దతు లభించింది. ఎక్కడికి వెళ్లినా భారతీయులు మంచి అభిమానాన్ని చూపుతారు. ఇక్కడ కూడా అలాంటి మద్దతే ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.' అని అన్నారు.

సానియాకు సీఎం కేసీఆర్‌ అభినందన
యుఎస్ ఓపెన్‌లో మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్‌ టైటిల్‌ సాధించిన సానియా మీర్జాను తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. గ్రాండ్‌స్లామ్‌ల్లో వరుసగా రెండో విజయం సాధించడం అద్భుతమని, భవిష్యత్‌లో సానియా మిర్జా ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

సానియా... నీ విజయం పట్ల దేశం యావత్తు గర్విస్తోంది: ప్రధాని మోదీ ట్వీట్

యుఎస్ ఓపెన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా సానియాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ''సానియా, యుఎస్ ఓపెన్ లో నీ విజయం అద్భుతం. అభినందనలు. నీ విజయం పట్ల దేశం యావత్తు గర్విస్తోంది'' అని మోడీ ట్వీట్ చేశారు.

Story first published: Wednesday, November 15, 2017, 12:24 [IST]
Other articles published on Nov 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+