Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమి: సానియా, మార్టినా వరుస విజయాలకు బ్రేక్

దోహా: సానియా మిర్జా, మార్టినా హింగిస్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. ప్రపంచ టెన్నిస్‌లో మహిళల డబుల్స్‌లో గతేడాది ఆగస్టు నుంచి వరుసగా సానియా మిర్జా, మార్టినా హింగిస్‌ల జోడీ విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విజయానికి ఖతార్‌లో అడ్డుకట్ట పడింది. వరుసగా 41 మ్యాచ్‌లు గెలిచిన సానియా, మార్టినా జోడీ ఖతార్‌ ఓపెన్‌లో అన్‌సీడెడ్‌ రష్యన్‌ జోడీ చేతిలో ఓటమి పాలైంది. ఆల్‌టైం రికార్డుకు కేవలం 3 మ్యాచ్‌ల దూరంలో ఉన్న ఈ జంట దోహాలో జరుగుతున్న ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో తడబడింది.

గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రష్యన్ జోడీ ఎలెనా వెస్నినా, దారియా కసక్తినా జోడీ చేతిలో 2-6, 6-4, 10-5 తేడాతో సానియా, మార్టినాలు ఓడిపోయారు. గతేడాది ఆగస్టులో సిన్సినాటి టోర్నీలో ఓటమి పాలైన తర్వాత సానియా-మార్టినా జోడీ వెనుదిరిగి చూడలేదు.

Sania Mirza-Martina Hingis pair's 41-match winning streak ends

ఆ తర్వాత ప్రపంచ టెన్నిస్‌లోనే అత్యుత్తమ జోడీగా టెన్నిస్‌లో మహిళల డబుల్స్ విభాగంలో నెంబర్ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. అంతేకాదు ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ మూడు వరుస గ్రాండ్ స్లామ్‌లను, పలు దేశాలకు చెందిన టైటిళ్లను గెలిచింది.

ఖతార్‌లోని దోహాలో సానియా, మార్టినా జోడీ ఓటమితో 44 వరుస మ్యాచ్‌ల రికార్డున్న జానా నవోత్నా, హెలెనా సుకోవాల రికార్డు ఇప్పటికి పదిలంగా నిలిచింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+