సిడ్నీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, స్విట్జర్లాండ్ భాగస్వామి మార్టినా హింగిస్‌లు ప్రపంచ రికార్డుని సమం చేశారు. ఈ జోడీ వరుసగా 28వ విజయాన్ని తమ ఖాతాలోకి వేసుకున్నారు. బుధవారం సిడ్నీలో జరిగిన డబ్ల్యూటీఏ సిడ్నీ అంతర్జాతీయ సెమీ ఫైనల్స్‌లో విజయం సాధించిన ఈ జోడీ అత్యధిక వరుస విజయాలు సాధించిన జోడీగా ప్రపంచ రికార్డు సృష్టించింది.
సిడ్నీలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌లో సానియా జోడీ 6-2, 6-3 వరుస సెట్లతో చెన్ లియాంగ్, షాయ్ పెంగ్‌ను ఓడించి వరుసగా 28వ విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో 1994లో జిగి ఫెర్నాండెజ్, నటాషా జెరెవా వరుసగా 28 విజయాలు సాధించి ప్రపంచ రికార్డు సాధించారు.

ఇప్పుడు ఈ రికార్డుని సానియా మిర్జా జోడీ సమం చేసింది. గతేడాది నుంచి చూస్తే సానియా మిర్జా, మార్టినా హింగిస్ జోడీ వరుసగా 10 డబ్ల్యుటీఏ డబుల్స్ టైటిల్స్‌ను గెలిచారు. అందులో ఇండియన్ వెల్స్, మియామి, చార్లెస్టన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, గాంజు, హువాన్, బీజింగ్, డబ్ల్యుటీఏ ఫైనల్స్‌తో పాటు గత వారంలో గెలిచిన బ్రిస్బేన్ అంతర్జాతీయ టైటిల్స్ ఉన్నాయి.