Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జిమ్‌లో తీవ్ర కసరత్తులు.. 4 నెలల్లో 26 కేజీలు తగ్గిన సానియా.. హీరోయిన్లకు పోటీ(వీడియో)

Sania Mirza lost 26kg in four months after pregnancy, weight loss video is viral

హైదరాబాద్: పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో పెళ్లి, కుమారుడు ఇజాన్ పుట్టిన తర్వాత భారత స్టార్ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన ఫిట్ నెస్ విషయంలో దృష్టి సారించింది. ఈ క్రమంలో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేంతగా నాజుకుగా తయారైంది. తాజాగా సానియా పోస్ట్ చేసిన వీడియోలో ఆమె అందం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం సానియా జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

4 నెలల్లో 26 కేజీలు

సానియా త్వరలో మళ్లీ అంతర్జాతీయ టోర్నీలో ఆడబోతోంది. వచ్చే ఏడాది రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందుకోసం సానియా ఇప్పటికే కసర్తత్తులు మొదలు పెట్టింది. అయితే తల్లి కావడంతో ఆటకు విరామం ఇచ్చిన సానియా.. బరువు తగ్గేందుకు జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తోంది. 4 నెలల్లో 26 కేజీల బరువు తగ్గిందంటే సానియా ఏవిధంగా కష్టపడిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ కసరత్తులు సంబందించిన వీడియోని సానియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నా

బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నా

'ఇజాన్ పుట్టిన తర్వాత నా బరువు గురించి చాలా మంది ప్రశ్నించారు. కానీ.. ఇప్పుడు బరువు తగ్గడం ఎలా సాధ్యమైందని వారే అడుగుతున్నారు. డెలివరీ అనంతరం 23 కేజీల బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నా. జిమ్‌లో కస్టపడి 26 కేజీల బరువు తగ్గా. శ్రమ, ఏకాగ్రత వల్లనే ఇది సాధ్యమైంది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా పేర్కొంది.

ఏదైనా సాధ్యమే

ఏదైనా సాధ్యమే

'బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇంత బరువు తగ్గడం మామూలు విషయం కాదని చాలా మంది నాకు రిప్లైలు పంపుతున్నారు. ఇది చూసి ఆనందంగా ఉంది. మహిళలకు ఓ మాట చెప్పదలుచుకున్నా. నేనే సాధించాను అంటే.. అది మీకు కూడా సాధ్యమవుతుంది. రోజుకు ఒకటి రెండు గంటలకు జిమ్‌లో కష్టపడండి. మీరే ఫలితాలను చూస్తారు. మనం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే' అని సానియా తెలిపింది.

పారిస్‌ వీధుల్లో చక్కర్లు

పారిస్‌ వీధుల్లో చక్కర్లు

సానియా మీర్జా ఇటీవలే పారిస్‌ వీధుల్లో చక్కర్లు కొట్టింది. అక్కడి నగర అందాలను తనివితీరా ఆస్వాదించింది. సానియా సోదరి ఆనమ్ మీర్జా త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆనమ్ మీర్జా తన బ్యాచిలర్‌ పార్టీని పారిస్‌లో ఏర్పాటు చేయడంతో ఇద్దరు సోదరీమణులు అక్కడ తెగ ఎంజాయ్ చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్‌ను ఆనమ్‌ వివాహం చేసుకోబోతోంది.

2017 చైనా ఓపెన్ చివరిది

2017 చైనా ఓపెన్ చివరిది

సానియా గతేడాది అక్టోబరులో ఇజాన్‌ మీర్జా మాలిక్‌కు జన్మనిచ్చింది. 2017లో చివరి సారిగా చైనా ఓపెన్ టోర్నీ ఆడింది. అప్పటినుంచి ఆమె ఆటకు దూరంగా ఉంది. 2020 జనవరిలోపు అంతర్జాతీయ పోటీలో పాల్గొంటానని ఇటీవలే సానియా తెలిపింది. 'మరికొన్ని నెలల్లో తాను మళ్లీ రాకెట్ పట్టి అంతర్జాతీయ సర్క్యూట్లో పునరాగమనం చేస్తా. వచ్చే రెండు నెలల్లో ఫిట్ నెస్ సాధించడంపైనే తన భవిష్యత్ ఆధారపడి ఉంది. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రత్యేకంగా లక్ష్యాలేవీ పెట్టుకోలేదని, ఎలాంటి విజయమైనా బోనస్ గానే భావిస్తానని' సానియా ఓ కార్యక్రమంలో తెలిపింది.

Story first published: Wednesday, September 25, 2019, 13:12 [IST]
Other articles published on Sep 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+