భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వైవాహిక జీవితం విషాదంగా ముగిసిన సంగతి తెలిసిన విషయమే. గతేడాది ఆమె తన భర్త షోయబ్ మాలిక్‌తో 15 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికింది.షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకోవడంతో, సానియా-షోయబ్ బంధం తెగిపోయింది.
సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధమే వారి విడాకులకు కారణమని తెలుస్తోంది. సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా, సంప్రదాయబద్ధంగానే తమ కుమార్తె విడాకులు తీసుకుందని స్పష్టం చేశారు. విడాకుల తర్వాత సానియా రెండో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు వచ్చినా, ఆమె మాత్రం సింగిల్‌గానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

సానియా బయోపిక్
సానియా మీర్జా జీవిత కథ ఆధారంగా సినిమా తీయాలనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. 2023లో ఆమె టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే, బయోపిక్ పనులు వేగవంతం అయ్యాయి. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలాకు చెందిన RSVP ఫిల్మ్స్ సానియా బయోపిక్ హక్కులను దక్కించుకున్నారు.2019లో అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.
ఈ బయోపిక్‌లో సానియా పాత్రను ఎవరు పోషిస్తారు, దర్శకుడు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. గతంలో, సానియా స్వయంగా దీపికా పడుకొనే లేదా పరిణీతి చోప్రా తన పాత్రకు సరిపోతారని భావించారు. అయితే, పరిణీతి చోప్రా ఇప్పటికే సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించడంతో, ఆమె ఈ ప్రాజెక్ట్‌లో ఉండే అవకాశం లేదు.
అక్షయ్ కుమార్‌తో రొమాన్స్‌కు రెడీ
తాజాగా, "ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో"లో పాల్గొన్న సానియా మీర్జా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన బయోపిక్‌లో హీరోగా ఎవరిని ఊహించుకుంటారని అడగ్గా, బాలీవుడ్ 'ఖిలాడీ' అక్షయ్ కుమార్ పేరు చెప్పింది.
తాను అక్షయ్‌కి పెద్ద ఫ్యాన్ అని, ఒకవేళ అతడు తన బయోపిక్‌లో నటిస్తే, అక్షయ్‌తో రొమాన్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సరదాగా వ్యాఖ్యానించింది. సానియా చేసిన ఈ ఫన్నీ కామెంట్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సానియా మీర్జా జీవితంలోని ఈ కొత్త మలుపులు, ఆమె బయోపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఈ బయోపిక్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది, ఎవరు నటిస్తారు అనేది వేచి చూడాలి.