ఆస్ట్రేలియన్ ఓపెన్ లో భారత స్టార్ సానియామీర్జా మొదటి రౌండులోనే ఓడిపోయింది. మహిళల సింగిల్స్ లో భాగంగా బెల్జియంకు చెందిన స్టార్ హెనిన్ తో మొదటి రౌండ్లో పోటీ పడిన సానియా ఓడిపోయింది. 5-7, 6-3, 6-1 స్కోరుతో ఓడిపోయింది. మొదటి రౌండులో తప్ప ఏ రౌండులోనూ సానియా ధాటిగా ఆడలేకపోయింది. దీంతో ఆమె వుమెన్ సింగిల్ రౌండ్ నుండి ఔట్ అయింది. ఆస్ట్రేలియా ఓబెన్ లో క్వాలిఫయింగ్ రౌండ్లను గట్టెక్కి మెయిన డ్రాలో చోటు దక్కించుకున్న సానియా మొదటి రౌండులోనే బెల్జియంకు చెందిన హెనిన్ తో పోటీ అనగానే సవాల్ ఎదుర్కొనాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. హెనిన్ ఇంతకుముందు నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. హెనిన్ రిటైరయినప్పటికీ గతేడాది నుండి మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టి, తన పాత అటను పునరావృతం చేస్తుంది. ధాటిగా అడుతూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పోయిస్తుంది. #13;