
ఆ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాల గురించి మాట్లాడింది. తనకు బాలీవుడ్‌లోనూ మిత్రులున్నారని చెప్పింది. సోనాక్షి సిన్హా తనకు మంచి స్నేహితరాలని చెప్పింది. బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా తనకు మిత్రులున్నారని, అయితే తాను వారితోనే సరిపెట్టుకోవడం లేదని అంది.
బాల్య మిత్రులనూ పాఠశాలలోని సహధ్యాయులనూ తాను కలుస్తుంటానని చెప్పింది. షోయబ్ తాను ఏ రియాల్టీ షోలోనూ కలిసి డ్యాన్స్ చేయడం లేదని, రియాల్టీ షోలోనే కాదు, ఎక్కడా డ్యాన్స్ చేయడం లేదని స్పష్టం చేసి, నవ్వేసింది. తన మరీ అంతగా ఫ్యాషన్ దుస్తులు ప్రత్యేకంగా ధరించబోనని చెప్పింది. అందరు ఆడపిల్లల మాదిరిగానే తాను డ్రెస్ చేసుకుంటాని అంటోంది.
స్టయిల్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా తాను దుస్తులను డిజైన్ చేయించుకోవడం లేదని, అయితే తనకు ఇండియాలోని ఉత్తమ డిజైనర్లు దొరికారని, వారు సృష్టించిన దుస్తులు ధరించే అవకాశం రావడం తనకు అవకాశం లభించిందని ఆమె చెప్పుకొచ్చింది. ఏదైనా సౌకర్యంగా ఉండాలని అనుకుంటానని, అదే తన స్టయిల్ అని చెప్పింది. ఏమైనా, ఆమెలో ఏదో మత్తు ఉందని మాత్రం ప్రపంచం ఇప్పటికీ భావిస్తూనే ఉంది.