హైదరాబాద్: భారత్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో స్టోసర్-గ్రోత్ జీడోపై సానియా-ఇవాన్ దొడిగ్ జోడీ 6-4, 2-6, 10-5 తేడాతో విజయం సాధించింది.
గంటా 18 నిమిషాలు పాటు జరిగిన పోరులో రెండో సీడ్‌గా టోర్నీ బరిలోకి దిగిన సానియా జోడీ చెమటోడ్చి ఫైనల్‌కు అర్హత సాధించింది. తొలి సెట్ ను కష్టపడి గెలవగా, రెండో సెట్‌ను కోల్పోయింది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది.

సూపర్ టైబ్రేక్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో తమ ఆట కంటే ప్రత్యర్థి తప్పిదాలతోనే సానియా జోడీ విజయం సాధించింది. మ్యాచ్‌లో సానియా, డోడిగ్ కేవలం 16 విన్నర్స్ సాధించింది. ఇక ప్రత్యర్థి స్టోసుర్ జోడీ 27 విన్నర్స్ సాధించడం విశేషం. అయితే ప్రత్యర్థి స్టోసుర్ జోడీ 25 అనవసర తప్పిదాల వల్లే సానియా జోడీకి విజయం సాధించింది.
గతేడాది ఆస్ట్రేలియా మహిళల డబుల్స్ టైటిల్‌ను మార్టినా హింగిస్‌తో కలిసి సానియా సాధించగా, 2009లో ఈ గ్రాండ్ స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను మహేశ్ భూపతితో కలిసి సొంతం చేసుకుంది.