వివాదాల తార సానియా

అదే ఏడాది చివరలో సిటీ సెక్యూరిటీ వింగ్ కు బాకీ పడిన చెల్లింపులు జరపాలని ఆదేశిస్తూ హైదరాబాద్ పోలీసు కమిషన్ కు, ఇతరులకు నోటీసులు జారీ చేశారు. తాము సానియా భద్రతా ఏర్పాట్లకు చెల్లింపులు జరపబోమని తాము చెప్పలేదని, ప్రభుత్వం నుంచి సరైన సమాచారం లేకపోవడం వల్లనే అది జరిగిందని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా దానికి వివరణ ఇచ్చారు.
సానియా సెలిబ్రిటీ మాత్రమే కాదు, లక్షాధికారి కూడా. అయితే ఒక సందర్భంలో ఆమె ఫొటో తెల్లరేషన్ కార్డుపై కనిపించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తుంది. విజయనగరం జిల్లాలో లక్ష్మి పేరు మీద సానియా ఫొటోతో ఆ రేషన్ కార్డు తయారైంది.
సానియాను తాను ప్రేమించానని, తననే పెళ్లి చేసుకోవాలంటూ మొహమ్మద్ అష్రాఫ్ అనే యువకుడు 2008 జులైలో ఆమె ఇంటి ముందు అల్లరికి దిగాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. సోహ్రాబ్ మీర్జాతో సానియా నిశ్చితార్థం జరిగిన సందర్భంలో కలత చెంది ఆ యువకుడు ఈ చర్యకు దిగాడు. ఆ యువకుడు సానియాను బెదిరిస్తూ సెల్ లో సందేశాలు కూడా పంపాడు. కాగా, తన చిన్ననాటి మిత్రుడు సోహ్రాబ్ మీర్జాతో జరిగిన నిశ్చితార్థాన్ని సానియా రద్దు చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిశ్చితార్థం రద్దుకు ఆమె హేతుబద్దమైన సమాధానాలు కూడా చెప్పలేదు. తనకు ఎంతో ఇష్టంగా ఎంచుకున్న వరుడు షోయబ్ మాలిక్ వివాదంలో చిక్కుకోవడం సానియాకు మరో పెద్ద సమస్యగా మారింది.
ఇదిలా ఉంటే, సానియా, షోయబ్ ల పెళ్లిపై మరో వివాదం చోటుచేసుకుంది. సానియా దేశ ద్రోహానికి పాల్పడుతోందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. హైకోర్టు న్యాయవాది, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుడు టీకేసీ శ్రీనివాసరావు బంజారాహిల్స్ పోలీసులకు సోమవారం ఈ ఫిర్యాదు చేశారు. భారత్ తరఫున ఆడి అనేక రివార్డులు, అవార్డులను సొంతం చేసుకున్న సానియా శత్రుదేశ పౌరుడిని పెళ్లాడాలని నిర్ణయించుకోవడం దేశ ద్రోహమని, ఆమెపై దేశద్రోహ నేరం కింద కేసు నమోదు చేయాలని ఆయన పోలీసులను కోరారు. షోయబ్ ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంపై శివసేన అధినేత బాల్ థాకరే సానియా మీర్జాపై నిప్పులు చెరిగారు. దాంతో రాజకీయ నాయకులు సానియాకు మద్దతుగా, వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ పోయారు.
Story first published: Wednesday, November 15, 2017, 12:24 [IST]
Other articles published on Nov 15, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications