హైదరాబాద్: సింగపూర్‌లో జరుగుతున్న డబ్ల్యూటీఏ పైనల్లో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా జోడీ విజయం సాధించింది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండో సీడ్ షువాయ్ పెంగ్ (చైనా), సువేసీ (చైనీస్ తైపీ)పై సానియా మిర్జా, కారా బ్లాక్ జోడీ గెలుపొందింది.
ఆదివారం జరిగిన తుదిపోరులో ఢిఫెండింగ్ ఛాంపియన్స్ సువేసీ (చైనీస్ తైపీ), షువాయ్ పెంగ్ (చైనా)లపై 6-1, 6-0లోత ఓడించి సానియా మిర్జా, కారా బ్లాక్ విజేతలుగా నిలిచారు. గతంలో వేరు వేరు భాగస్వాములతో ఈ టోర్నీని రెండు సార్లు నెగ్గిన కారా బ్లాక్‌కు ఇది మూడో టైటిల్ కావడం విశేషం.
వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్‌లో తొలిసారి డబ్ల్యూటీఏ టైటిల్‌ను సాధించింది. డబ్ల్యూటీఏ ఫైనల్స్ మహిళల డబుల్స్‌లో కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి ఫైనల్‌కు చేరింది.

తెలంగాణకి గర్వకారణం: సీఎం కేసీఆర్
కెరీర్‌లో తొలిసారి డబ్ల్యూటీఏ టైటిల్‌ను సాధించిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జాని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అభినందించారు. సానియా మిర్జా తెలంగాణకే గర్వకారణమని అన్నారు.
ఇక శనివారం జరిగిన సెమీఫైనల్లో చెక్-స్లొవేనియా ద్వయం క్వెటా పెష్కే, కాటరీనా స్రెబోట్నిక్‌తో సానియా-కారా ద్వయం తొలుత 2-0తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ అనూహ్యంగా మొదటి సెట్‌ను కోల్పోయింది.
అయితే రెండో సెట్లో హోరాహోరీగా పోరాడి మ్యాచ్‌లో నిలిచింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో మొదట 6-9తో వెనకబడిన సానియా ద్వయం తర్వాత పుంజుకుని వరుసగా ఐదు పాయింట్లు సాధించి సెట్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.
ఇక ఫైనల్లో సానియా జంట సువేసీ (చైనీస్ తైపీ), షువాయ్ పెంగ్ (చైనా)తో తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే సానియా-కారా జంట వీరిద్దరి చేతిలో మూడుసార్లు ఓటమి పాలయ్యింది. అయితే చివరి సారి మాంట్రియల్‌లో తలపడినపుడు మాత్రం విజయం సానియా జోడీనే వరించింది. కారా బ్లాక్‌తో కలిసి సానియా మిర్జా ఆడిన చివరి టోర్నీ ఇది. వచ్చే ఏడాది నుంచి సానియా మిర్జా సువిసైతో కలిసి డబుల్స్ ఆడనుంది.