Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జ్యూయలరీ షో ర్యాంప్‌పై షో టాపర్‌గా సానియా మిర్జా

భారత్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఓ అంతర్జాతీయ జ్యూయలరీ షోకి షో టాపర్‌గా మెరవనున్నారు. ఇటీవలే మహిళల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న సానియా మిర్జా ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయలరీ వీక్ (ఐఐజెడ్ల్యు)లో పాల్గొనున్నారు.

అప్పుడప్పుడు మోడలింగ్ ర్యాంప్‌పై మెరిసే సానియా మిర్జా ప్రస్తుతం పలు కార్యక్రమాలతో బీజీ అయ్యారు. ఇటీవలే తన భర్త షోయబ్ మాలిక్ కోసం సానియా శ్రీలంక వెళ్లిన సంగతి తెలిసిందే. ఆగస్టు 3న ముంబైలో జరిగే 'ది ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయలరీ వీక్' లో సానియా తళుకుబెళుకులు ప్రదర్శించనుంది.

Sania Mirza to be Showstopper at India International Jewellery Week

ఈ షోలో షో టాపర్‌గా సానియా మిర్జా మోనీ అగర్వాల్ డిజైన్ చేసిన 'జొరాక్షి' సిరీస్ ఆభరణాలను ధరించి కనువిందు చేయనున్నారు. మోనీ అగర్వాల్ తన నగలను స్టేజీపై ప్రదర్శించేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐఐజెడ్ల్యులో ప్రతి ఏడాది పాల్గొంటానని, ఈ ఏడాది 'జొరాక్షి' సిరీస్ ఆభరణాలను ప్రదర్శించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రపంచంలోని అత్యంత అధ్భుతంగా ఉండేలా పుష్పాలను తలపించేలా ఈ నగలను మోనీ అగర్వాల్ డిజైన్ చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+