For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

36వ విజయం: ఆస్టేలియన్ ఓపెన్ సానియా, హింగిస్‌లదే

By Nageswara Rao

మెల్‌బోర్న్: ఉమెన్స్ డబుల్స్ టెన్నిస్‌లో సానియా మిర్జా, మార్టినా హింగిస్ జోడీ హవా కొనసాగుతోంది. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా, మార్టినా హింగిస్ జోడీ గెలుచుకుంది. మెల్‌బోర్న్ పార్క్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్‌లో సానియా-హింగిస్ జోడి 7-6, 6-3 స్కోర్‌తో చెక్‌రిపబ్లిక్‌కు చెందిన హవకోవా-హడేకా జోడీపై గెలుపొందారు.

ఈ విజయం సానియా మిర్జా, మార్టినా హింగిస్ జోడీకి వరుసగా మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు ఈ విజయంతో సానియా - మార్టినా హింగిస్ జోడీ వరుసగా 36 విజయాలను సాధించిన జోడీగా రికార్డు సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలి సెట్ టైట్‌గా సాగినా రెండో సెట్‌లో సానియా, హింగిస్ జోడీ పైచేయి సాధించారు.

Sania Mirza and Martina Hingis win Australian Open

దీంతో ప్రత్యర్ధి జోడీ చేతులెత్తేసింది. 36 మ్యాచ్‌ల్లో వరుసగా 6వ గ్రాండ్ స్లామ్‌ను ఈ జోడీ గెలుచుకుంది. తాజా విజయంతో ఈ జోడీ క్యాలెండర్ గ్రాండ్ స్లామ్‌కు చేరువలో ఉంది. మ్యాచ్ అనంతరం ట్రోఫీని అందుకున్న మార్టినా హింగిస్ మాట్లాడుతూ 'సానియా ధన్యవాదాలు, నువ్వు లేకుండా నేనిక్కడ లేను ' అని వ్యాఖ్యానించారు.

'ఈ టోర్నమెంట్‌లో ఎంతగానో శ్రమించాం, వచ్చే ఏడాది కూడా టైటిల్ నిలబెట్టుకుంటాం' అని స్విస్ దిగ్గజం మార్టినా హింగిస్ అన్నారు. అనంతరం సానియా మిర్జా మాట్లాడుతూ ఇక్కడ ఆడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ తనకెంతో ప్రత్యేకమన్నారు.

'నా పార్టనర్ మార్టినా హింగిస్‌కు థ్యాంక్స్. మా ఇద్దరి జోడీగి ఈ ఏడాది ఎంతగానో కలిసొచ్చింది. తనతో కలిసి ఆడటం నాకెంతో గర్వంగా ఉంది. మార్టినా ఓ అద్భుతమైన వ్యక్తి' అని సానియా మిర్జా కొనియాడారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+