హైదరాబాద్: హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పట్టాయా ఓపెన్ టెన్నిస్ టోర్మమెంట్ ఫైనల్లో ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో వెరా జొనరెవాపై ఆమె 5-7, 1-6 స్కోరుతో ఓడిపోయింది. జెనరెవా 2008లో ఏడు మార్లు ఫైనల్ కు చేరుకుంది. ప్రేగ్, గాంగ్ జౌవ్ టైటిల్స్ ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్ లో సెమీ ఫైనల్ దాకా చేరుకుంది.
ఓపెనింగ్ సెట్టులో జెరనోవాకు గట్టి పోటీ ఇచ్చిన సానియా రెండో సెట్టులో పూర్తిగా చేతులెత్తేసింది. సానియా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో మగ్దాలేనా రైబారికోవాను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. డబ్ల్యుటిఎ టూర్ ఈవెంట్లో సానియా సింగిల్స్ పైనల్ కు చేరుకోవడం ఇది నాలుగోసారి.