కెరీర్‌లో తొలిసారి డబుల్స్‌లో టాప్ టెన్‌లో సానియా

ఈ క్యాలెండర్‌లో సానియా ఇప్పటివరకూ మూడు డబుల్స్ టైటిళ్లను సాధించి, మొత్తం గెలిచిన సంఖ్య12ట్రోఫీలకు చేరింది. వెస్నినాతో కలిసి ఇండియన్ వెల్స్, ఛార్లెస్‌టన్‌లో, కజకిస్తాన్ భాగస్వామి యరోస్లావాతో కలిసి కాలేజ్‌పార్క్‌లతో గెలుపు జోడీగా నిలిచింది. సానియా-వెస్నినా జోడీ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో రష్యా భాగస్వామి ఎలీనా వెస్నినాతో కలిసి మూడో రౌండ్ వరకూ వెళ్లి, మోకాలి గాయంతో ఆటకు దూరమైంది.
ఈ సందర్బంలో సానియా మిర్జా మాట్లాడుతూ 'నిద్ర లేచి ప్రపంచంలో టాప్ టెన్‌లోకి ప్రవేశించానని తెలుసుకున్నాను. ఇన్నేళ్లుగా అండగా నిలచినందుకు, అభిమానించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని సానియా తన ట్విట్టర్ పేజ్‌లో రాసింది. ఈ ఘనతకు సానియాను మహేష్ భూపతి అభినందించాడు. అయితే, ఈ సంవత్సరపు చివరి గ్రాండ్ శ్లామ్‌లో సింగిల్స్‌లో మొదటి రౌండ్‌తోనే తిరుగుముఖం పట్టినందుకు సానియా సింగిల్స్ ర్యాంకింగ్ 64 నుంచి 81కి పడిపోయింది. అయితే సింగిల్స్‌లో మాత్రం సానియా 81వ స్థానంలో ఉంది. మోకాలి గాయం వల్ల ఈ సీజన్‌లో సానియా ఆడే అవకాశాలు లేకపోవడంతో భారత్-రష్యా జోడీ కొన్ని పాయింట్లు కోల్పోయే అవకాశముంది. ప్రస్తుతం ఈ జోడీ 4788 పాయింట్లతో ఉండగా, యరోస్లావా ష్వెదోవా, అమెరికన్ వైనా జోడీ 4685 పాయింట్లతో చేరువలో వీరికి చేరువలో ఉంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications